»   » చెత్త నటుడుగా రామ్ చరణ్

చెత్త నటుడుగా రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ కి జంజీర్ తలనొప్పి వదిలేటట్లు కనపడటం లేదు. ఈ సినిమాలో నటించినందుకు గానూ ఆయనకు చెత్త నటుడు అవార్డు లిస్ట్ లో ఆయన్ని పెట్టింది బాలీవుడ్. అలాగే వరస్ట్ రీమేక్ చిత్రంగానూ జంజీర్ ని నామినేట్ చేసింది. వీటిని గోల్డెన్ కేలా అవార్డులు అంటారు. గోల్డెన్ కేలా అవార్డులు బాలీవుడ్ లో వచ్చిన పేలవమైన చిత్రాలుకు ప్రకటిస్తూంటారు. ఉత్తమ చెత్త చిత్రం, ఉత్తమ చెత్త నటుడు,నటి,దర్శకుడు ఇలా ప్రతీ విభాగంలోనూ అవార్డులు అందిస్తారు. వీటిని గత ఆరు సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు.

2013 సంవత్సరానికిగాను చెత్త నటుల్లో రణ్‌వీర్‌సింగ్ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉండగా లిస్ట్‌లో రామ్‌చరణ్ కూడా ఉన్నాడు. దీపికా పడుకోనే 'వరస్ట్ యాక్ట్రెస్'గా అవార్డును అందుకోబోతుంది . సోనమ్‌కపూర్, సోనాక్షిసిన్హా, ప్రియాంక చోప్రా వంటి నటీమణులు నామినేట్ అయిన ఈ అవార్డు చివరికి దీపికా పడుకోనేకు దక్కేలా ఉందట. ఈ వరస్ట్ అవార్డులను 'గోల్డెన్ కేలా ఫెస్టివల్' పేరుతో అందిస్తారు.

Golden Kela 2014 for Worst Actor

ఎప్పుడూ మంచి సినిమాలు, మంచి నటనకేనా? అప్పుడప్పుడూ చెత్త అవార్డులు కూడా అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొదలైన ఉత్సవం ఇది. హాలీవుడ్‌లో ఇస్తున్న 'గోల్డెన్ రాస్‌బెర్రీ అవార్డ్స్' తరహాలో 'వరస్ట్ ఆఫ్ బాలీవుడ్' పేరిట 'గోల్డెన్‌కేలా' అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇక, విషయానికొస్తే దీపికా పడుకోనే ఏ చిత్రంలో నటనకు చెత్తనటిగా నామినేట్ అయ్యిందో తెలుసా? 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీకి! సోనాక్షి 'ఆర్.. రాజ్‌కుమార్' సినిమాలో, సోనమ్‌కపూర్ 'రాన్‌ఝానా' సినిమాలో, ప్రియాంక చోప్రా 'జంజీర్' సినిమాలో చూపిన నటన కారణంగా చెత్త తారలుగా నామినేట్ అయ్యారు.

English summary
The nominations for the Golden Kela Awards 2014 to honour the worst performances and movies of the year have been announced.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu