»   » రామ్ చరణ్ తేజ 'ఆరెంజ్' లేటెస్ట్ ఇన్ఫో

రామ్ చరణ్ తేజ 'ఆరెంజ్' లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబైలో తొలి షెడ్యూల్‌ జరుపుకున్న'ఆరంజ్‌' చిత్రం భారీ షెడ్యూల్‌ ఆస్ట్రేలియాలో జరగనుంది. మార్చి మొదటివారం నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో కీలక సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరున చరణ్‌ సిడ్నీ బయలుదేరి వెళ్లనున్నారు. రామ్ చరణ్ తేజ, జెనీలియా కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.నాగేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మగధీర వంటి ఘన విజయం సాధించిన చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంపై ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే బొమ్మరిలు, పరుగు చిత్రాలతో భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరు తెచ్చుకున్న భాస్కర్‌...చరణ్‌ తో ఓ సున్నితమైన ప్రేమకథగా 'ఆరంజ్‌'కు రూపకల్పన చేశారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన జెనీలియా, షాజాన్‌ పదంసీ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌ రెడ్డి, సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: ఆనందసాయి, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంభాషణలు: తోట ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మన్యం రమేష్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu