»   » రామ్ చరణ్ ధాయ్ ల్యాండ్ స్టంట్ స్కూల్ (ఫొటోలు)

రామ్ చరణ్ ధాయ్ ల్యాండ్ స్టంట్ స్కూల్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం బాగా కష్టపడుతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో ఆయన స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన కొత్త తరహా స్టంట్స్ ప్రాక్టిస్ చేస్తున్నారు. అందుకోసం ఆయన ధాయిలాండ్ వెళ్లారు. ఈ ట్రైనింగ్ తో ఆయన చేసే ఫైట్స్ న్యాచురల్ ఫీల్ వస్తుందనే నమ్మకంతో చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం రామ్ చరణ్ ...జింకా స్టంట్ టీమ్ తో ..బ్యాంకాక్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. జింకా స్టంట్ టీమ్..ధాయిలాండ్ లో ..మార్షిల్ ఆర్ట్ ట్రైనింగ్ స్కూల్. అక్కడ చాలా పాపులర్ స్కూల్. చాలా మంది నటులు ఈ స్కూల్ లో ప్రాక్టీస్ అయ్యారు. ముఖ్యంగా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 300 చిత్రం కు సంభందించిన స్టంట్స్ ఇక్కడ డిజైన్ చేసినవే.

ధాయిలాండ్ లో రామ్ చరణ్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ ఉత్సాహంగా ఎలా కొత్త తరహా స్టంట్స్ డిజైన్ చేసుకోవటానికి, తన బాడీని ఎలా రూపొందించుకుంటున్నారు అనేది ఈ క్రింద ఉన్న పొటోలలో చూడవచ్చు.

రామ్ చరణ్ @ ధాయ్ స్కూల్ ఫొటోలు స్లైడ్ షో లో

రామ్ చరణ్ @ ధాయ్ ల్యాండ్ స్టంట్ స్కూల్ (ఫొటోలు)

రామ్ చరణ్ @ ధాయ్ ల్యాండ్ స్టంట్ స్కూల్ (ఫొటోలు)

రామ్‌చరణ్‌ హీరోగాగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

రామ్ చరణ్ @ ధాయ్ ల్యాండ్ స్టంట్ స్కూల్ (ఫొటోలు)

రామ్ చరణ్ @ ధాయ్ ల్యాండ్ స్టంట్ స్కూల్ (ఫొటోలు)


రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత.

దర్శకుడు మాట్లాడుతూ ....

దర్శకుడు మాట్లాడుతూ ....

''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ....

నిర్మాత మాట్లాడుతూ ....

''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

టైటిల్

టైటిల్

ఈ చిత్రానికి మై నేమ్ ఈజ్ రాజు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. జగగేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో చిరంజివి పాడే పాటలోంచి ఈ టైటిల్ ని తీసుకున్నారు.

విజేత స్పూర్తితో

విజేత స్పూర్తితో

చిరంజీవి సూపర్ హిట్ చిత్రం విజేత కథ నుంచి ప్రేరణ పొంది ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Currently Ram Charan is in Bangkok and he is taking regressive training Jaika Stunts Team, one of the most popular martial art training school in Thai. Jaika Stunts Team has trained many actors, worked for many Hollywood films and it was 300 movie which has brought the stunt team into spot light.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu