»   » రామ్ చరణ్ మళ్లీ : అప్పట్లో పెంచుకునే కుక్క కోసం ..ఇప్పుడు 'ధృవ' కోసం

రామ్ చరణ్ మళ్లీ : అప్పట్లో పెంచుకునే కుక్క కోసం ..ఇప్పుడు 'ధృవ' కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ 'తని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ని త్వరలో మొదలు పెట్టనున్నారు. అయితే ఈ గ్యాప్ లో ఆయన తన శరీరంపై పూర్తి దృష్టి పెట్టారు.

ముఖ్యంగా ట్రైనీ ఐపియస్ అధికారి పాత్ర కావటంతో ఫిట్ గా ఉండాలని నిర్ణయంచుకున్నారు. అందులో భాగంగా ఆయన తన ఆహారపు అలవాట్లును సైతం మార్చుకుంటున్నారు. ఈ విషయమై ఆయన స్వయంగా తన అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా తెలియచేసారు.


తాను ధృవ చిత్రం కోసం వెజ్ గా మారానని అన్నారు. అప్పట్లో ఆయన తన కుక్క కోసం వెజ్ గా మారారు. ఎవడు చిత్రం సమయంలో అది జరిగింది. అప్పటి న్యూస్ మనం ఓ సారి గుర్తు చేసుకుంటే..

రామ్ చరణ్ రీసెంట్ గా శాఖాహారిగా మారారు. అయితే లైఫ్ స్టైల్ రీజన్స్ కోసమో..మరి దేని కోసమే కాదు ఆయన మారింది. తను గారంగా పెంచుకుంటున్న కుక్క కోసం ఆయన వెజిటేరియన్ గా మారారు. ఆ విషయం ఆయనే తెలియచేసారు.

Ram Charan turns vegetarian for Dhruva movie

ఆయనకు ఆ కుక్కను ఉపాసన గిప్ట్ గా ఇచ్చింది. రామ్ చరణ్ మాట్లాడుతూ.. "నాకు నా వైఫ్ ఉపాసన నుంచి ఓ కుక్క గిప్ట్ గా మార్చి 27న నా పుట్టిన రోజున వచ్చింది. ఆ కుక్కను మొదటి సారి చూడగానే నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. నా భార్య ఏం పేరు పెడదాము అని అడిగిన వెంటనే వేరే ఆలోచన లేకుండా బ్రాట్ అని పెట్టాను. బ్రాట్ అనేది నా దగ్గర పెరిగిన అంతకు ముందు కుక్క పేరు. అది నా అజాగ్రత్త వల్ల నా చేతుల్లోనే చనిపోయింది.

ఆ కుక్క నాతో 18 నెలలే ఉంది కానీ చాలా అనుబంధం పెంచుకుంది. అందుకే ఈ కుక్కకు ఆ పేరు పెట్టాను. రామ్ చరణ్ ఇక రీసెంట్ గా ..ఈ కొత్త బ్రాట్...కు ప్రాక్చర్ అయ్యి...కాలులో రాడ్ ఇనసర్ట్ చేసారు. ఆ సమయంలో దాని పెయిన్ చూస్తే చాలా బాధ వేసింది.

త్వరగా అది కోలుకుని పరుగెత్తాలని కోరుకున్నా..అప్పటివరకూ నేను నాన్ వెజ్ ఫుడ్ వదిలేయాలనుకున్నాను. ఈ మధ్యనే దాని కాలులోంచి రాడ్ తీసేసారు. అది పూర్తిగా రికవరి అయ్యి పరుగెత్తాలని కోరుకుంటున్నా. అది బాగుండటం కోసం ఏదైనా చేస్తాను. " అని ఎమోషన్ ల్ గా చెప్పుకొచ్చారు.


నిజానికి వేగంగా షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది.


రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. నెక్ట్స్ తాను చేయబోయే సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.

అల్లు అరవింద్ సలహా మేరకే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో రూటు మార్చాడని అంటున్నారు. థాని ఒరువన్ మూవీలో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కేవలం కథ ఆధారంగా మాత్రమే నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రూ. 25 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించే అవకాశం ఉంది.

English summary
For Dhruva Ram Charan has been training rigorously. Also Cherry has been drinking too much of juice and has turned vegetarian. Ram Charan took to Facebook and posted his latest avtaar and wrote, "Goin veggie for Dhruva !!! Hope it's worth it”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu