»   » అందుకోసమే నేను శాఖాహారిగా మారా: రామ్ చరణ్

అందుకోసమే నేను శాఖాహారిగా మారా: రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ రీసెంట్ గా శాఖాహారిగా మారారు. అయితే లైఫ్ స్టైల్ రీజన్స్ కోసమో..మరి దేని కోసమే కాదు ఆయన మారింది. తను గారంగా పెంచుకుంటున్న కుక్క కోసం ఆయన వెజిటేరియన్ గా మారారు. ఆ విషయం ఆయనే తెలియచేసారు. ఆయనకు ఆ కుక్కను ఉపాసన గిప్ట్ గా ఇచ్చింది.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. "నాకు నా వైఫ్ ఉపాసన నుంచి ఓ కుక్క గిప్ట్ గా మార్చి 27న నా పుట్టిన రోజున వచ్చింది. ఆ కుక్కను మొదటి సారి చూడగానే నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. నా భార్య ఏం పేరు పెడదాము అని అడిగిన వెంటనే వేరే ఆలోచన లేకుండా బ్రాట్ అని పెట్టాను. బ్రాట్ అనేది నా దగ్గర పెరిగిన అంతకు ముందు కుక్క పేరు. అది నా అజాగ్రత్త వల్ల నా చేతుల్లోనే చనిపోయింది. ఆ కుక్క నాతో 18 నెలలే ఉంది కానీ చాలా అనుబంధం పెంచుకుంది. అందుకే ఈ కుక్కకు ఆ పేరు పెట్టాను.

ఇక రీసెంట్ గా ..ఈ కొత్త బ్రాట్...కు ప్రాక్చర్ అయ్యి...కాలులో రాడ్ ఇనసర్ట్ చేసారు. ఆ సమయంలో దాని పెయిన్ చూస్తే చాలా బాధ వేసింది. త్వరగా అది కోలుకుని పరుగెత్తాలని కోరుకున్నా..అప్పటివరకూ నేను నాన్ వెజ్ ఫుడ్ వదిలేయాలనుకున్నాను. ఈ మధ్యనే దాని కాలులోంచి రాడ్ తీసేసారు. అది పూర్తిగా రికవరి అయ్యి పరుగెత్తాలని కోరుకుంటున్నా. అది బాగుండటం కోసం ఏదైనా చేస్తాను. " అని ఎమోషన్ ల్ గా చెప్పుకొచ్చారు.

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 25 న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు జూలై 31 కి మారే అవకాసం ఉందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల రిలీజ్ వాయిదా వేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ డేట్ ఛేంజ్ అనేది నిజమే అయితే మిగతా సినిమాల విడుదలలు కూడా మారే అవకాసం ఉంది. ఇటీవలే రెండు పాటల్ని స్విట్జర్లాండ్‌, బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరాయి. దిల్‌ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్‌ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు.

English summary
Actor Ram Charan, we discovered, has recently turned vegetarian. And no, this has nothing to do with health or lifestyle reasons. He turned vegetarian for his pet dong "Brat".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu