Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చెర్రీ, ఉపాసన, మంచు లక్ష్మి, ఆండీ...(వీకెండ్ ఎంజాయ్మెంట్)
హైదరాబాద్: తెలుగు సినీ రంగానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు మధ్య మంచి స్నేహం ఉంది. అయితే వీరి స్నేహం టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ లాంటిది అంటుంటారు వారి గురించి బాగా తెలిసిన వారు. వీరి సంగతెలా ఉన్నా వీరి పిల్లలు మాత్రం చిన్నతనం నుండి ఫిల్మ్ నగర్లో కలిసి పెరిగిన వారే. రామ్ చరణ్, మంచు లక్ష్మి, మంచు విష్ణు, మనోజ్ మంచి ఫ్రెండ్స్.
మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లకి మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు, లక్ష్మి ప్రసన్నతో పాటు మనోజ్, విష్ణు తదితరులు హాజరవ్వడం.... మంచు వారి ఇంట జరివే వేడుకలకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ హాజరవ్వడం పలు సందర్భాల్లో చూసే ఉంటాం.
అయితే రామ్ చరణ్ తన భార్య ఉపాసన, మంచు లక్ష్మి తన భర్త ఆండీ శ్రీనివాసన్‌తో కలిసి పార్టీ చేసుకున్న చేసిన సందర్బాలు చాలా తక్కువ. ఇటీవల వీరంతా కలిసి ఓ వీకెండ్ బాగా ఎంజాయ్ చేసారు. మరి ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ మంచు లక్ష్మి తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేసిది.
స్లైడ్ షోలో మంచు లక్ష్మి పోస్టు చేసిన ఫోటలు, వివరాలు...

థాయ్‌లాండ్ లోనా?
థాయ్ లాండ్ లోని ఖోసముయ్ అనే ప్రాంతంలో వీరంతా కలిసి ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

హ్యాపీగా..
అంతా కలిసి పార్టీ చేసుకుంటూ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు.

ఆండ్రీ శ్రీనివాసన్
ఈ పార్టీలో మంచు లక్ష్మి భర్త ఆండీ శ్రీనివాసన్ తో పాటు మరికొందరు పాలు పంచుకున్నారు.

ఫ్రెండ్షిప్
మంచు వారితో రామ్ చరణ్ కు ముందు నుండీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది.