ఆనందాన్ని వెతుక్కుంటూ....రామ్ చరణ్, ఉపాసన ఎక్కడికెళ్లారో తెలుసా?

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీ బిజీగా గడుపుతుంటారు. ఇద్దరికీ ఏ మాత్రం తీరిక సమయం దొరికినా ఆ కొద్ది సమయాన్ని సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రిస్మస్ హాలిడే సీజన్లో వారు ఆనందాన్ని వెతుక్కుంటూ ఎక్కడికెళ్లారో తెలుసా? అయితే మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయాల్సిందే.

ఆనందంగా గడిపిన చెర్రీ-ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన గురువారం ఆశ్రయ్‌ ఆకృతి అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన చిన్నారుల దగ్గరికి వెళ్లి ఆనందంగా గడిపారు. వారితో కలిసి క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడి పాడారు. చిన్నారులతో గడిపిన వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

త్వరలోనే విషయం తెలుస్తుందన్న ఉపాసన

త్వరలోనే విషయం తెలుస్తుందన్న ఉపాసన

ఈ హాలిడే సీజన్లో ప్రేమను, సంతోషాన్ని పంచాలని ఉపాసన వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ ఈ దివ్యాంగ చిన్నారులతో ఎందుకు ఇంత ఎటాచ్మెంట్ తో ఉన్నారో త్వరలోనే మీకే తెలుస్తుంది అని ఉపాసన పేర్కొన్నారు.

ఉపాసనకు ఎప్పుడూ చరణ్ గురించిన ఆలోచనలే

ఉపాసనకు ఎప్పుడూ చరణ్ గురించిన ఆలోచనలే

రామ్ చరణ్‌ను ఉపాసన ముద్దుగా మిస్టర్ సి అని పిలుస్తూ ఉంటుంది. తన ఫేస్ బుక్, ట్విట్టర్లో ఆమె చేసే పోస్టుల్లో ఎక్కువగా చరణ్ గురించి అంశాలే ఉంటాయి. చరణ్ సినిమాలను ప్రమోట్ చేయడంలో ఆమె ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటారు.

భర్త అంటే ఎంత ప్రేమో

భర్త అంటే ఎంత ప్రేమో

ఉపాసన‌, రామ్ చరణ్ చిన్నతనం నుండి స్నేహితులనే విషయం తెలిసిందే. తన బెస్ట్ ఫ్రెండుతో జీవితాంతం అలాగే ఉండి పోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X