»   » ‘పేరంటాల పల్లి’లో సందడి చేసిన రామ్ చరణ్-ఉపాసన (ఫోటోస్)

‘పేరంటాల పల్లి’లో సందడి చేసిన రామ్ చరణ్-ఉపాసన (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'పేరంటలాల పల్లి'.... పాపికొండల విహారయాత్రకు వెళ్లిన వారికి ఈ ఊరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో జరుగుతోంది. షూటింగ్ గ్యాపులో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి పాపికొండలు విహారానికి వెళ్లారు. ఇందులో భాగంగా పాపికొండల మధ్య ఉండే గిరిజనగూడెం పేరంటాలపల్లిని సందర్శించారు.

పేరంటాలపల్లికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసించే గ్రామస్తుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

వీరి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

వీరి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

పేరంటాలపల్లి గ్రామస్తుల నుండి నేర్చుకోవాల్సి చాలా ఉంది. వారికి పరిమితమైన సౌకర్యాలే ఉన్నప్పటికీ ఉన్నదాంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. తమ గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో జీవిస్తున్నారు. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అని ఉపాసన అభిప్రాయ పడ్డారు.

గ్రామస్తులతో కలిసి ఫోటో

గ్రామస్తులతో కలిసి ఫోటో

ఈ సందర్భంగా ఉపాసన, రామ్ చరణ్ పేరంటాలపల్లి గ్రామస్తులతో కలిసి ఫోటో దిగారు. అక్కిడి వారితో ఊరి గురించి, ఊరి బాగోగుల గురించి చర్చించారు.

రామ్ చరణ్-సుకుమార్ మూవీ

రామ్ చరణ్-సుకుమార్ మూవీ

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా వివరాల్లోకి వెళితే... ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో లీక్: రామ్ చరణ్ లుక్ ఊరమాస్ (ఫోటోస్)

రామ్ చరణ్-ఉపాసన

రామ్ చరణ్-ఉపాసన

సినిమాల సంగతి పక్కన పెడితే.... రామ్ చరణ్-ఉపాసన సంబంధించిన పలు ఆసక్తికర విషయాల కోసం క్లిక్ చేయండి.

English summary
Ram Charan and Upasana have gone for a tour of Papikondalu. Upasana shared the details of this trip on her social networking page. The Wife of the Star Hero disclosed that they received a rousing reception when they have been to Perantalapalli in Papikondalu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu