‘ఎవడు’ సినిమాలో చెర్రీ సొంత నెంబర్ (ఫోటో)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తన సొంత కారు నెంబర్‌నే ఇందులో వాడిన బైక్‌కూ వాడారు. రామ్ చరణ్ కార్లలో ఒక దాని నెంబర్ 2727. ఇప్పుడు అదే నెంబర్ 'ఎవడు' సినిమాలో బైకుకూ వాడారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. సెంటిమెంటుగా ఈ నెంబర్ ను వాడినట్లు తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిర జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం జులై 31న విడుదల చేసేందుకు డేట్ ఫైనల్ అయింది. అంతకు ముందు జులై 25 అనుకున్నప్పటికీ సెంటిమెంటు కలిసొస్తుందని జులై 31(మగధీర రిలీజ్ డేట్)ని ఫైనల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.
మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











