Don't Miss!
- News
Snake Bite: నాగుపాముతో నాటకాలా.. యువకుడి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..
- Finance
Trading Fact: ఆ ట్రేడింగ్ చేసినోళ్లు నిండా మునిగిపోయారు..! సంచలన రిపోర్ట్.. జాగ్రత్త
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మారుతుందా?.. మరోసారి ఏసీసీ మీటింగ్?
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Ram Charan తో పెళ్లైన పదేళ్ల తర్వాత.. సంతానం ఇంత లేటుగా ఎందుకంటే.. ఉపాసన రియాక్షన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి ఎప్పుడవుతాడా అని ఓ వర్గం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా వచ్చింది. ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు అని కొణిదెల వారి కుటుంబ సభ్యులు అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వడం అందరికి ఆనందాన్ని ఇచ్చింది. ఇక ఒక్కసారిగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంతకుముందు ఉపాసన పిల్లలను కనే విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అనేదానిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లి జరిగి పదేళ్లయినా..
ఉపాసన రాంచరణ్ తేజ్ ఇద్దరు కూడా రెండు ఉన్నతమైన కుటుంబాలుకు చెందినవారు. వీరిది పెద్దలకు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి పదేళ్లయినా వారి మొదటి ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అనేక రకాల కథనాలు వచ్చాయి.

గతంలో ఉపాసన అసంతృప్తి
ఆ మధ్యలో విభిన్నమైన తరహాలో వార్తలు రావడంతో ఉపాసన కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. పిల్లలను కనడం అనేది తమ వ్యక్తిగత విషయం అని, అనవసరంగా దానిపై ఎందుకు మిగతా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు అని ఆమె అన్నారు. అంతే కాకుండా పిల్లలను కనడం అనేది తమ వ్యక్తిగత విషయమని ఆ విషయంలో ప్రైవసీ ఉంటేనే బాగుంటుంది అని అన్నారు.

ఉపాసన మాట్లాడుతూ..
అంతేకాకుండా గతంలో ఉపాసన ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.. అందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారు అనే ప్రశ్నకు ఉపాసన ఈ విధంగా స్పందించారు. అది మా జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ పిల్లలు పెంపకం అనేది ఒక 20 ఏళ్ల ప్రాజెక్టు లాంటిది. ఒక విధంగా అది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా 20 ఏళ్ళు అనేది చాలా ముఖ్యం. వారితో చాలా క్లోజ్ గా వెళుతూ ఉండాలి.. అని ఉపాసన అన్నారు.

20 ఏళ్ల జీవితం అంకితం ఇవ్వాలి
పిల్లల జీవితాలకు పేరెంట్స్ తప్పనిసరిగా 20 ఏళ్ల జీవితం అంకితం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లకు కావాల్సినవి సమకూర్చాలి. తప్పకుండా మేము వాటిని పుట్టబోయే పిల్లలకు అందించాలి అనే ఆలోచనతోనే ఉన్నాము. దానికోసం కొంత నాలెడ్జ్ కూడా అవసరం. ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచాలి. ఆ శుభతోరణం కోసం మానసికంగా శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.. అని ఉపాసన తెలిపారు.

ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలని..
ఒక ప్రాణాన్ని మనం ఈ ప్రపంచంలోకి తీసుకు వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఆలోచించాలి. వారికి ముఖ్యంగా విద్య మంచి విద్యను ఎలా అందించాలి. అలాగే ఎలాంటి ఆలోచనలతో పెంచాలి అనే విషయంలో కూడా ఎంతో అవగాహన పెంచుకోవాలి. మేము పిల్లలను కనడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలని అనుకున్నాము. కానీ దానికి ఒక సరైన సమయం అయితే ఉంటుంది.. అని అన్నారు.

ఒక 20 ఏళ్ల చాలెంజ్
అలాగే పిల్లలను కనేందుకు మెంటల్ గాను ఫిజికల్ గాను కూడా రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక 20 ఏళ్ల చాలెంజ్. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత 20 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎలా పెంచాను అనేది కూడా మీకు తెలియాలి. అది కూడా చాలా ముఖ్యం. ఇలాంటి పొరపాట్లు లేకుండా వారి పెరుగుదలను చూడాలి. అందుకోసం తప్పనిసరిగా అది చాలా ముఖ్యమని ఉపాసన ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు.