twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెడ్ రిలేషన్స్‌ను పట్టించుకోను... నేను అదోటైపు.. నాకే తెలియదు.. వర్మ

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదాలు, రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం మార్చి 29న రిలీజై సక్సెస్‌పుల్‌గా ముందుకెళ్తున్నది. ఈ సందర్భంగా వర్మ మీడియాతో ముచ్చటించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయడానికి ఏర్పడిన పరిస్థితులు, ఆ సినిమాకు కోసం చేసిన పరిశోధనను వెల్లడించారు. ఇంకా ఆయన తన వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను ఇలా పంచుకొన్నారు. వివరాల్లోకి వెళితే...

     నేను అదోటైపు నాకే తెలియదు

    నేను అదోటైపు నాకే తెలియదు

    రాంగోపాల్ వర్మకు పిచ్చి, మెంటల్, పర్వర్టెడ్ అని ఓ వర్గం అనుకొంటారు. ఆర్జీవి ఇంటిలిజెంట్, జీనియస్, ఇంటెలెక్చువల్ అని మరో వర్గం అనుకొంటారనే విషయం నాకు తెలుసు. కానీ ఎవ్వరికి కూడా నేనంటే ఏమో తెలియదు. నేను ఓ టైపు అంతే. అదేంటో నాకు తెలియదు. ఇంటిలిజెంట్, మెంటల్ అనే విషయాలు మధ్య చాలా తేడా ఉంది. పచ్చ కామెర్ల వ్యాధి ఉన్న వాళ్లకు లోకమంత పచ్చగానే ఉంటుంది అంటారు. ఎవరూ ఏ కోణంలో చూస్తే వారికి నేను అలా కనిపిస్తాను.

    పడక గది సంబంధాలను పట్టించుకోను

    పడక గది సంబంధాలను పట్టించుకోను

    బంధాలు, అనుబంధాలకు నేను దూరం. అలా అని రిలేషన్స్‌ను నేను పట్టించుకోనని అనుకోవద్దు. నా దృష్టిలో పడక గది సంబంధాలకు విలువ ఇవ్వను. వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని అనుకొంటాను. కానీ మనుషులతో బంధాలకు ప్రాధాన్యం ఇస్తాను. ఓ వ్యక్తి నుంచి నాకు ఎలాంటి సంతోషం కలిగిస్తుందనే విషయాలను బట్టి రిలేషన్స్ ఆధారపడి ఉంటాయి.

    లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్

    ఎన్టీఆర్ చివరి రోజుల్లో దారుణమైన

    ఎన్టీఆర్ చివరి రోజుల్లో దారుణమైన

    ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రధానంగా నటుడిగా నేను చాలా ఇష్టపడుతాను. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే హత్తుకునే విధంగా తీశాననిపిస్తుంది. ఆయన జీవితాంతం మహారాజులా, చక్రవర్తిలా బతికారు. కానీ ఆయన జీవితపు చరమాంకంలో చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. మానసిక క్షోభను అనుభవించారు. అదే విషయాన్ని సినిమాలో చూపించాను.

    సెన్సార్ అభ్యంతరాలు రాకుండా

    సెన్సార్ అభ్యంతరాలు రాకుండా

    సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం కాకూడదనే ఉద్దేశంతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పాత్రల పేర్లను మార్చాల్సి వచ్చింది. ఎలాంటి వివాదాలకు గురికాకూడదని పాత్రల పేర్లను పరోక్షంగా ప్రస్తావించాను. ఈ సినిమా తీసేటప్పుడు కొంతమందిని మాత్రమే కలిశాను. ఎందుకంటే వారికి తోచినట్టుగా, వారికి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో కలువలేదు అని వర్మ అన్నారు.

    English summary
    Director Ram Gopal Varma' Lakshmi's NTR going good at Box office. This movie getting good response all over the world. As part of the promotion, He speaks about the movie and personal relations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X