twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రజారాజ్యంలో బావ రాజ్యం... రాంగోపాల్ వర్మ క్లారిటీ.. చిరంజీవిపై సెటైర్లు అంటూ..

    |

    దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలన్నీ స్తంభించిన సమయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ హంగామా సృష్టిస్తున్నారు. వివాదాలను టచ్ చేస్తూనే వరుస సినిమాలతో ప్రేక్షకులను కేక పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆర్జీవి చేసిన ట్వీట్ మరోసారి సినీ పరిశ్రమలో కలకలం రేపింది. చిరంజీవి, జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు లాంటి వారిని టార్గెట్ చూస్తున్నట్టు ఓ ట్వీట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పొలిటికల్ సెటైర్ వేస్తున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ వార్తలపై వర్మ స్పందిస్తూ..

    నచ్చకపోతే నా సినిమాలు చూడకండి

    నచ్చకపోతే నా సినిమాలు చూడకండి


    తన సినిమాలు వివాదంలో కూరుకుపోయడం, నెటిజన్లు, సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేయడంపై వర్మ స్పందించారు. గత 20 ఏళ్లుగా నాకు నచ్చిన విధంగా నేను సినిమాలు తీసుకొంటూ పోతాను. మీకు నచ్చితే చూడండి లేకపోతే చూడకుండా వదిలేయండి. అంతేగానీ నాపై కామెంట్లు చేస్తే పట్టించుకోవడానికి నాకు అంత సమయం లేదు అని అన్నారు.

    సెక్స్ సినిమాలు తీస్తే తప్పేంటి?

    సెక్స్ సినిమాలు తీస్తే తప్పేంటి?

    బూతు సినిమాలు తీస్తున్నారంటే నేను అసలే ఒప్పుకోను. నాకు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీయడం ఇష్టం. ఇతర కథలకు ఎంత ప్రాముఖ్యం ఇస్తానో.. సెక్స్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను. కరోనావైరస్, అమృత సెక్స్ సినిమాలా? అందులో సెక్స్ ఉందా? క్లైమాక్స్, నెకెడ్ లాంటి సెక్స్ సినిమాలు తీస్తే తప్పేముంంది? ఆ సినిమాలు చూసే వర్గం వాటిని చూస్తాయి అని వర్మ అభిప్రాయపడ్డారు.

    నాకు అన్ని ఎమోషన్స్ ఒకటే

    నాకు అన్ని ఎమోషన్స్ ఒకటే

    నా జీవితంలో నేను సెక్స్‌కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. కొందరికి హిపోక్రసీ. సెక్స్‌ను ఓ సపరేట్ అంశంగా చేసి దానిని ప్రత్యేకంగా చూస్తారు. నాకు అలా చూడటం ఇష్టం ఉండదు. అన్ని ఎమోషన్స్‌ మాదిరిగానే సెక్స్‌ను కూడా చూస్తాను. అంతేగానీ ఎవరో ఏదో అన్నారని నేను నా స్టయిల్ మార్చుకోను అని వర్మ పేర్కొన్నారు.

    రూమర్లపై నాకు స్పందించాల్సిన అవసరం లేదు

    రూమర్లపై నాకు స్పందించాల్సిన అవసరం లేదు

    మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌ను టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారనే వార్తలపై నేను స్పందించాను. ఎందుకంటే నేను ఏ సినిమా తీయాలి.. దానిని ఎప్పుడు ప్రకటించాలి అనేది నా ఇష్టం. నా సినిమాల గురించి ఎప్పుడు, ఎలా చెప్పాలో నాకు సంబంధించిన అంశం. ప్రజారాజ్యంలో బావరాజ్యం అనే సినిమాతో చిరంజీవి, అల్లు అరవింద్‌పై సెటైర్లు వేస్తున్నారని వెబ్‌సైట్లలో వచ్చే వార్తలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఆ వార్తలన్నీ తప్పు అని వర్మ అన్నారు.

    Recommended Video

    #NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
    ఫ్యాక్చువల్ రియాలిటీ కొత్త జనరేషన్ సినిమా

    ఫ్యాక్చువల్ రియాలిటీ కొత్త జనరేషన్ సినిమా

    ఫ్యాక్చువల్ రియాలిటీ అనే కొత్త తరం సినిమా. ఆర్జీవివరల్డ్‌థియేటర్‌ సాక్షిగా నేను కొత్తగా ఆవిష్కరించబోతున్నాను. అలాంటి కోవలో వచ్చే సినిమాలు ఫిక్షనల్‌గా ఉండొచ్చు. వాస్తవిక కథ కావొచ్చు. నిజం ఆధారంగా సినిమాగా రూపొందవచ్చు. రియల్ పీపుల్, రియల్ సిట్యుయేషన్స్‌తోపాటు ఫిక్షనల్ స్టోరిగా సినిమా రావొచ్చు అని వర్మ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రవన్ కల్యాణ్, ఒమెగాస్టార్, సీబెన్, లాకేష్ వై ఎస్ జగన్ కేసీఆర్, కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    Director Ram Gopal Varma reveals about Factual Reality (FR). He tweeted that FICTIONAL REALITY(FR) is a genre I am inventing for the first time in the world in RgvWorldTheatre..Films can be either fictional or true stories or based upon truth ..FR is about depicting characters based upon REAL PEOPLE and REAL SITUATIONS in a fictional story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X