Don't Miss!
- News
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ బిగ్ స్కెచ్- ఏపీ సహా: 12 రోజుల పాటు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సంతకం ఫోర్జరీ చేశారు..వాళ్ళని వదిలేదే లేదు.. పోలీసులకు వర్మ ఫిర్యాదు
గత కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ నట్టి కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రాంగోపాల్ వర్మ తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని ఆ డబ్బులు ఇవ్వకుండా నాటకాలాడుతున్నారని నట్టి కుమార్ అనేక సంచలన ఆరోపణలు చేశారు. తర్వాత వర్మ కూడా కొన్ని సందర్భాల్లో ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
కానీ ఇప్పుడు తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. నట్టి కుమార్ కుమారుడు నట్టి క్రాంతి, కుమార్తె నటి కరుణ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. తన డేంజరస్ సినిమా విడుదల సమయంలో తనను ఇబ్బంది పెట్టిన నట్టి అండ్ కో మీద న్యాయ పోరాటం మొదలు పెట్టానని వర్మ మీడియాతో పేర్కొన్నారు.
తాను సినిమా విడుదల సమయంలో 50 లక్షలు ఇస్తానని హామీ పత్రం ఇచ్చినట్టు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని ఫోర్జరీ చేశారని రాంగోపాల్ వర్మ ఆరోపించారు.. ఆ సంతకం నాది కాదు, అడ్రస్ నాది కాదు అవన్నీ కూడా దొంగతనంగా సృష్టించినవే వాళ్ళు కోర్టును సైతం పక్క దోవ పట్టించేలా ప్లాన్ చేశారు అంటూ వర్మ ఫైర్ అయ్యారు.

'ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్(తెలుగులో 'మా ఇష్టం') చిత్రాన్ని ఆపడానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఈ పోర్జరీ కేసుకు సంబంధించిన వివరాలను చెప్పి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో వారిపై వ్రాత పూర్వక కంప్లైంట్ ఇచ్చాను' అని ఆర్జీవీ చెప్పారు. ఇక తన డేంజరస్ సినిమాకు సంబంధించిన లెటర్ హెడ్ మీద నటి ఎంటర్టైన్మెంట్ కు చెందిన క్రాంతి కరుణ సంతకం ఫోర్జరీ చేశారని ఆయన ఆరోపించారు.
అంతే కాక వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో వాళ్లు కూడా మీ మీద కేసులు వేశారు కదా మరి ఆ సంగతి చెప్పమని అడిగితే అది ఇదే అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో నట్టికుమార్ రామ్ గోపాల్ వర్మ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. హైదరాబాదులో ఉన్న పాత ఆఫీస్, ముంబైలో ఆఫీసు ఎందుకు కాళీ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఆయన నిర్మాతలను మోసం చేస్తూ సినిమాలు చేస్తున్నారని అలా చేస్తున్న అందువల్లే అన్నిచోట్ల పెట్టే బేడా సర్థుకుని చేయాల్సి వచ్చిందని నట్టికుమార్ ఆరోపించారు. తనకు రావలసిన డబ్బు వచ్చేదాకా వర్మను వదిలేదని లేదని అన్నారు. ఇక వర్మ కంప్లైంట్ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు.