»   » పోస్ట్ డిలీట్ చేయి.. లేదంటే యూఎస్ నుంచి వచ్చి తన్నుతా.. వర్మకు వార్నింగ్..

పోస్ట్ డిలీట్ చేయి.. లేదంటే యూఎస్ నుంచి వచ్చి తన్నుతా.. వర్మకు వార్నింగ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అంతా నా ఇష్టం చెడామడా ... అంటూ సాగే పాటకు అచ్చు గుద్దినట్టు వ్యవహరించే వ్యక్తి చిత్ర పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా? అంటే... చటుక్కున గుర్తుకు వచ్చే వ్యక్తి అర్జీవీ. అదేనండి రామ్ గోపాల్ వర్మ. అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుపెట్టి.. శివ సినిమాతో మొదలు... తన చిత్రాలే కాదు.. ఆయన మాటల్లో... ఆయన స్పందించే తీరుల్లో ... ఆయన వ్యవహారించే తీరు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన... వంగవీటి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నా... ఆయా కుటుంబాల నుంచి.. వారి అభిమాన సంఘాల నుంచి వచ్చిన బెదిరింపులపై సైతం అర్జీవీ ఐ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించారు. అలాంటి ఆయనకు కన్న కూతురు నుంచే బెదిరింపులు వస్తే ఏలా స్పందించాడు. అంటే ఇలా...

రీసెంట్ గా తల్లితో దిగిన ఫోటో...

ప్రపంచబాధను తన బాధగా ఫీలై... ప్రపంచ పటంలో ఏ మూలన ఏం జరిగిన వెంటనే సోషల్ మీడియా వేదికగా చేసుకుని స్పందించే అర్జీవీ.. తన కుటుంబ వ్యవహారంపై మాత్రం ఆచూ తూచి స్పందిస్తాడు. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే గతంలో తన కూతురు చిన్ననాటి ఫోటో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా తన తల్లితో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు. తాజాగా తన కూతురు రేవతి జిమ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేశాడు.

కూతురు జిమ్ చేస్తున్న వీడియో..

కూతురు జిమ్ చేస్తున్న వీడియో..

వర్మ కూతురు రేవతి తాను జిమ్ చేస్తున్న వీడియోని పర్సనల్ గా పోస్ట్ చేస్తే.. రాము వెంటనే స్పందించి నా కూతురు రేవతి నన్ను కొట్టేందుకు తనంతట తానే ట్రైనింగ్ అవుతుందని అనే కామెంట్ పెట్టి ఆ వీడియోను షేర్ చేశాడు. ఇది చూసిన అర్జీవీ కూతురు తండ్రికి వార్నింగ్ ఇచ్చింది.

డిలీట్ చేయ్యి.. లేదంటే కొడతా..

డిలీట్ చేయ్యి.. లేదంటే కొడతా..

నేను నీకు పర్సనల్ గా వీడియో పంపాను... నువ్వు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావు అని ప్రశ్నించింది. అతంటితో ఆగకుండా ఆ పోస్ట్ ను వెంటనే డిలీట్ చేయి లేదంటే... అమెరికా నుంచి వచ్చి నిజంగానే కొడతానని మెసేజ్ ఇచ్చింది.

నా కూతురు ఇలా..

తన కూతురు కామెంట్ కు స్పందించిన వర్మ... నా కూతురు నాకు ఈ విధంగా మెసేజ్ పెట్టింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా... నా కూతురు నుంచి రక్షించుకునేందుకు కాలేజ్ డేస్ లో నేను చేసిన బ్రూస్ లీ స్టంట్స్ గుర్తు చేసుకుంటున్నాను అని అప్పటి ఫోటో షేర్ చేశాడు వర్మ.

సరైన సమాధానం కోసం..

సరైన సమాధానం కోసం..

దీనిపై కూతురు స్పందన ఎలా ఉంటుందో... దానికి అర్జీవీ ప్రతి స్పందన ఉంటుందా? లేక కాలానికి వదిలేస్తాడా ? లేక ఇంకా వెరైటీగా ఆలోచించి సమాధానం చెబుతాడా? అనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
వర్మ పోస్ట్ లకు సరైన సమాధానం రేవతి ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

English summary
Director Ram Gopal Varma recently posted a photo of his daughter Revathi in Social media. But Revathi angry over her father RGV. She warned to delete from the facebook. She warned that.. If not, I will come and beat you.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu