Just In
- 1 hr ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 2 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 3 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 4 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Disha: శంషాబాద్ ఏసీపీతో రామ్ గోపాల్ వర్మ మీట్.. అందుకే వచ్చానంటూ కామెంట్స్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది 'దిశ' ఘటన. హైదరాబాద్‌కి చెందిన వెటర్నరీ డాక్టర్‌ని మాయమాటలు చెప్పి అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేశారు. ఈ ఉదంతం గురించి తెలిసి ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. దిశ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సీన్ రీ క్రియేషన్ చేస్తుండగా.. వాళ్ళు పారిపోబోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ ఇష్యూకి ఫుల్‌స్టాప్ పడింది.

వర్మ స్టేట్‌మెంట్.. దిశ మూవీ
అయితే ఈ సబ్జెక్టును కథగా తీసుకొని తాను సినిమా రూపొందిస్తానని ఇటీవలే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. తన తర్వాతి సినిమా పేరు ‘దిశ' అని, దిశ రేప్ ఘటన గురించి ఈ సినిమా ఉండబోతోందని తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అందరి చూపు వర్మ తీయబోతున్న 'దిశ' మూవీపై పడింది.

రేపిస్ట్ భార్యను విచారించిన వర్మ
ఈ నేపథ్యంలో దిశ ఘటనలో నిందితులు, ఆ ఘటన జరిగిన తీరు, ఎన్‌కౌంటర్ అన్ని అంశాలపై ఆరాదీయడం స్టార్ట్ చేశారు వర్మ. ఇందులో భాగంగా రేపిస్ట్‌లలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను ఇటీవలే వర్మ కలిసిన సంగతి తెలిసిందే. ఆమెను తన ఆఫీస్‌కు పిలిపించి చెన్నకేశవులుకు సంబంధించిన కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారు వర్మ.

దిశనే కాదు.. ఆమెనూ మోసం చేశాడు
పదహారేళ్ల వయసులోనే రేణుక చెన్నకేశవులును పెళ్లి చేసుకుందని, 17 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ఆమెను కలిసిన తర్వాత వర్మ వెల్లడించాడు. దిశనే కాదు ఆ రాక్షసుడు రేణుకను కూడా మోసం చేశాడని.. రేణుక ఇంకా చిన్న పిల్ల అని అన్నాడు వర్మ. ఆమెకు, ఆమెకు పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తు లేదని వర్మ తెలిపారు.

శంషాబాద్ ఏసీపీతో వర్మ మీట్.. అందుకే
ఇకపోతే దిశ ఘటన తాలూకు వివరాలు సమగ్రంగా తెలుసుకోవడంలో భాగంగా.. తాజాగా శంషాబాద్ ఏసీపీని కలిశాడు వర్మ. ఈ మేరకు దిశ ఘటన తాలూకు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. దిశ ఘటన గురించి తెలుసుకునేందుకే ఏసీపీని కలిశానని వర్మ తెలిపాడు.


ఎవ్వరి అనుమతి అవరసం లేదు
దిశ మూవీ తీసేందుకు ఎవ్వరి అనుమతి అవరసం లేదని ఈ సందర్భంగా వర్మ చెప్పాడు. కుటుంబ సభ్యుల అనుమతి కూడా అవరసం లేదని ఆయన పేర్కొన్నాడు. త్వరలోనే మరికొందరిని కలిసి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని వర్మ చెప్పాడు.