»   » వర్మ... ‘కిల్లింగ్ వీరప్పన్’ కొత్త పోస్టర్స్ ఇవిగో

వర్మ... ‘కిల్లింగ్ వీరప్పన్’ కొత్త పోస్టర్స్ ఇవిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో కాంట్రవర్శీ సబ్జక్ట్ ను ఎన్నుకుని ‘కిల్లింగ్ వీరప్పన్' అనే సినిమాకు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజే మొదలైంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను ఆయన విడుదల చేసారు. ఆ ఫోటోలను క్రింద మీరు చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వర్మ మాట్లాడుతూ... వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు.

ఇర రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కోసం తమిళ నాడు, కర్ణాటకల్లోని వీరప్పన్ స్థావరాలు ఏర్పరచుకున్న ప్రదేశాలను ఇప్పటికే ఎంపిక చేశారు. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.

స్లైడ్ షోలో ఫొటోలు...

ఆటలా...

ఆటలా...

వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు.

తిరుగులేని క్రిమినల్..

తిరుగులేని క్రిమినల్..

ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు.

అదే కథ...

అదే కథ...

అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు.

అందుకే క్రేజ్

అందుకే క్రేజ్

ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది.

ధ్రిల్లర్ గా...

ధ్రిల్లర్ గా...

సినిమా అద్భుతంగా రూపొందనుందని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని వర్మ ఈ సందర్భంగా తెలిపాడు.

మూడు భాషల్లో

మూడు భాషల్లో

కన్నడం, హిందీ, తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ వర్మ ప్రకటించాడు.

English summary
Ram Gopal Varma, known for path-breaking films such as “Sarkar” and “Rakht Charitra”, will next make a movie titled “Killing Veerappan” on the man who gunned down the dreaded smuggler. A multi-lingual project, “Killing Veerappan” will be made in Kannada, Telugu, Tamil and Hindi.On Thursday, 18 June, Ram Gopal Varma took to his Twitter page to unleash the first look of "Killing Veerappan". The posters offer a glimpse at the stunning look of Shivarajkumar, who is said to be playing a police officer in the film. The posters have gone viral on social media just minutes after the filmmaker released them.
Please Wait while comments are loading...