»   » పవన్ తుస్సుమనిపించాడంటూ వర్మ వ్యాఖ్య

పవన్ తుస్సుమనిపించాడంటూ వర్మ వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొదటి నుంచీ పవన్ పార్టీ పెట్టాలి అని ట్వీటిన వ్యక్తుల్లో ప్రధముడు రామ్ గోపాల్ వర్మ. పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన పార్టీకి,పవన్ కి అనుకూలంగా ట్వీట్స్ చేసారు. అయితే తాజాగా ఆయన పవన్ రాసిన ఇజం పుస్తకం అర్దం కావటం లేదని ట్వీట్ చేసారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పవన్ తుస్సుమనిపించాడని అన్నారు. రౌడీ ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ పవన్ రాజకీయ జీవితంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. అవేమిటంటే...

'రాజకీయంగా పవన్ సక్సెస్ అవుతాడని చెప్పలేం. తొలి సభలో అతను మాట్లాడిన తీరు నాకు నచ్చింది. రెండు గంటలు బాగానే కూర్చోబెట్టాడు. అయితే... నరేంద్రమోడీని ఎప్పుడైతే కలిశాడో... అప్పుడే అతనిపై జనాలకున్న అభిప్రాయం మొత్తంగా మారిపోయింది. ఇటీవల వైజాగ్‌లో జరిగిన బహిరంగ సభలో కూడా అతని మాటలు పూర్తిగా తేలిపోయాయి. అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే... తుస్సుమనిపించాడు!' అని అన్నారు.

Ram Gopal Varma Satires On Pawan Kalyan

ఇక పవన్‌కల్యాణ్ 'ఇజమ్' పుస్తకం గురించి చెప్తూ... రెండు పేజీలు చదివాను. నాకేం అర్థం కాలేదు. అసలు రాసిన వాళ్లకైనా ఈ పుస్తకం అర్థమవుతుందా అని నా అనుమానం. నాకు తెలిసి ఈ పుస్తకం పవన్‌కల్యాణ్‌కి కూడా అర్థమై ఉండదు. ఈ పుస్తకం ద్వారా తాను ఏం చెప్పబోతున్నాడు? అసలు అతని 'ఇజం' ఏంటి? అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఆ పుస్తకంలో వాడిన ఇంగ్లిష్ పదాలు కానీ, రాజకీయ భావజాలం కానీ ఆంగ్ల సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలెన్నో చదివిన నాకే అర్థం కాలేదు అన్నారు.

గతంలో వర్మ... 'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదు.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు అని ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్ గనుక పాద యాత్ర చేస్తే కనుక...అది మహాత్మా గాంధీ పాదయాత్రను గుర్తు చేస్తుంది అని నేను చెప్పగలను అంటూ పవన్ ని ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. అప్పట్లో మహాత్మా గాంధీ పాద యాత్ర కి జనం చాలా మంది వచ్చారు. అదే విధంగా పవన్ కీ ఫాలోవర్స్ ఉన్నారని వర్మ అన్నారు.

English summary
Even before Pawan Kalyan made formal announcement, RGV has started canvassing for Pawan Kalyan. But recently he tweeted... "i tried to read ISM nd I doubt if the writers themselves can understand it..I really wish that Pawan kalyan will release a simpler version" .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu