»   » హద్దు దాటిన వర్మ ట్వీట్లు... ఆగ్రహం లో పవన్ ఫ్యాన్స్

హద్దు దాటిన వర్మ ట్వీట్లు... ఆగ్రహం లో పవన్ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ పనిగట్టుకొని మరీ పవన్ ని కెలకటం మాత్రమే పని గా పెట్టుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చే ముందు రోజు వరకూ రెచ్చిపోయి పొగిడిన వర్మ ఆ తర్వాత నుంచీ కావాలనే పవన్ ని టార్గెట్ చేసాడు. నాగ బాబు కోపం తో చేసిన దగ్గరినుంచీ మొత్తం మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసిన వర్మ పవన్ మీద మాత్రం ఇంకాస్త ఎక్కువ దృష్టే పెట్టాడు. కాటమరాయుడు మూవీ పై వర్మ చేస్తున్న రచ్చ ఇప్పుడు అంతా ఇంతా కాదు టాలీవుడ్ మొత్తం ఒక దుమారం రేగినంత పిచ్చెక్కిపోతోంది.

అభిమానులు వెర్రి భ్రమల్లో ఉండడం, గుడ్డిగా, మూగగా ఉండడం వల్ల.. వాళ్ల నాయకులు కూడా అలాగే తయారవుతున్నారని ఓ ట్వీట్‌ చేశాడు. ఆ వెంటనే.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా ఇస్తే మంచదని తనతో ఎవరో అన్నట్టు మరో ట్వీట్‌ చేశాడు. అంతేకాదు పవన్‌ అభిమానులను డున్నపోతులతో పోల్చాడు. అలాగే దున్నపోతులకు కనీసం గట్టి చర్మమైనా ఉంటుందని.. పవన్‌ ఫ్యాన్స్‌కు అది కూడా ఉండదు" అంటూ మరింత తీవ్రంగా విమర్శించాడు

Ram Gopal Varma Sensational Tweet On Pawan Kalyan Katamarayudu

అలాగే 'కాటమరాయుడు' సినిమా చూడడం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్‌ చేశాడు. అలాగే పవన్‌ కల్యాణ్‌ కనీసం 'బాహుబలి' ట్రైలర్‌ను చూసి అయినా ఇలాంటి పవర్‌లెస్‌ సినిమాలు చేయడం మానుకోవాలని చేసినట్వీట్ మరింత ఆగ్రహం తెప్పించ్గింది పవన్ ఫ్యాన్స్ కి. అంతే కాదు మరిన్ని ట్వీట్లతో రెచ్చిపోతూనే ఉన్నాడు వర్మ...

30 కోట్లుపెట్టి సినిమా తీసి 100 కోట్లకి అమ్ముకొని 70 కోట్లు జేబులో వేసుకుని కూతురు బర్థ్ డే కోసం వెళ్ళిపోవటం అంటే రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేల్ వాయించిన దానికి ఇదేం తక్కువ కాదు అంటూ వేసిన ట్వీట్ కి వచ్చిన రిప్లైలు అయితే ఫ్యాన్స్ ఎంత కాకమీద ఉన్నారో తెలిపేలా ఉన్నాయి. ప్రతీ ట్వీట్ కిందా బండ్ల గణేష్ ఆన్సర్లూ... వర్మ కౌంటర్లూ... అసలు ఒక యుద్దమే జరిగింది... ఒక పక్క సినిమా సంగతే అర్థం కావటం లేదంటే.. ఇప్పుడు వర్మ మంచి పబ్లిసిటీ ఇస్తున్నాడుగా...

English summary
Ram Gopal Varma is back again posting his mark tweets on the film Kaatamarayudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu