For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆమె మీద ఒట్టేసి పవన్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. శ్రీదేవిని కూడా తీసుకొచ్చాడు.!

  By Manoj
  |

  రాంగోపాల్ వర్మ.. ఈ పేరు అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇష్టం. అదే సమయంలో మరికొంత మందికి కోపం కూడా. దీనికి కారణం ఆయన కొద్ది రోజులుగా వ్యవహరిస్తున్న తీరే. గతంలో మంచి మంచి సినిమాలు తీసిన సమయంలో ఆర్జీవీని.. తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలను ప్రతి ఒక్కరూ చూసేవారు. కానీ, కొన్నేళ్లుగా ఈ సంచలన దర్శకుడు వివాదాస్పద చిత్రాలనే తెరకెక్కిస్తుండడంతో చాలా మందికి విలన్‌గా కనిపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా వర్మను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. దీనికి కారణం గతంలో వర్మ.. పవన్‌పై చేసిన వ్యాఖ్యలే. తాజాగా ఆయన మరోసారి పవర్‌ స్టార్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ వర్మ ఏమన్నాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ

  పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ

  రాంగోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్‌పై కొన్నేళ్లుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత బాగా టార్గెట్ చేశాడు. ఈ క్రమంలోనే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో జనసేనానిని పోలిన పాత్రను కూడా చూపించాడు. అయినప్పటికీ వర్మ తగ్గడం లేదు. సామాజిక మాధ్యమాల్లో తరచూ ఏదో ఒక రకంగా పవన్‌ను లాగుతున్నాడు.

  వర్మను చంపేసిన జనసైనికులు

  వర్మను చంపేసిన జనసైనికులు

  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రను కూడా చూపించడంతో జనసేన కార్యకర్తలు రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా బ్యానర్లు తయారు చేయించారు. అందులో ఆయనకు శ్రద్దాంజలి ఘటించడంతో పాటు ఆత్మకు శాంతి చేకూరకూడదని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను స్వయంగా వర్మే ట్వీట్ చేయడం విశేషం.

  పవన్ కల్యాణ్‌పై వర్మ సినిమా

  పవన్ కల్యాణ్‌పై వర్మ సినిమా

  ఈ మధ్య రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలనే తెరకెక్కించాడు వర్మ. ఎన్నో అడ్డంకుల నడుమ ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి అదే తరహా సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. వర్మ త్వరలోనే పవన్ కల్యాణ్‌పై ఓ సినిమాను తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు.

  ఇలాంటి పనులు వర్మకే సాధ్యం

  ఇలాంటి పనులు వర్మకే సాధ్యం

  రాంగోపాల్ వర్మ పర్యవేక్షణలో అగస్త్య మంజు తెరకెక్కించిన చిత్రం ‘బ్యూటిఫుల్'. ఈ మూవీలో నైనా గంగూలీ, పార్థ్ సూరి జంటగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వర్మ తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారితో వోడ్కా పార్టీ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ పార్టీకి చిత్ర యూనిట్‌తో పాటు ఎంతో మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

   పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్

  పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్

  ఈ పార్టీలో వర్మ.. పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పవన్ కల్యాణ్ గారికి తిక్కుంది. నాకు లెక్కుంది. కానీ, లెక్క కన్నా తిక్కే కొందరికి ఇష్టం ఉంటది. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. నాకు శ్రీదేవి కంటే పవన్ అంటే ఇష్టం. ఇది మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా. నేను దేవుడిని నమ్మకు కాబట్టి చెప్పాను. మీరు నమ్మకపోతే మీ ఖర్మ' అని ఆయన వ్యాఖ్యానించారు.

  English summary
  Ram Gopal Varma is an Indian film director, screenwriter and producer, known for his works in Telugu cinema, Bollywood, and television. Varma directed films across multiple genres, including parallel cinema and docudrama noted for their gritty realism, technical finesse, and craft.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X