»   » కలాం మరణం: అలా చేయడం థ్రిల్లింగ్ అంటూ వర్మ ట్వీట్

కలాం మరణం: అలా చేయడం థ్రిల్లింగ్ అంటూ వర్మ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత రత్న, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం మరణంతో దేశ వ్యాప్తంగా విషాదం నెలకొంది. దేశంలోని ప్రతి వ్యక్తి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అందరూ ఆయనకు సంతాపం వ్యక్తం చేసారు.

సినీ సెలబ్రిటీలంతా కలాం మరణంపై విషాదం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేసారు. వివాదాస్పద ట్వీట్లు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో కలాం మరణంపై ట్వీట్లు చేసారు.

Ram Gopal Varma tweet about Abdul Kalam

కలాంజీకి రిప్ అని మెసేజ్ లు పెట్టకుండా ట్విట్టర్ జనాలు సెలబ్రెటీలు ఆయన గురించి ఇంత కేరింగ్ గా మాట్లాడుతుండటం నాకు చాలా థ్రిల్లింగ్ గా చాలా సంతోషంగా అనిపిస్తోంది. కానీ జనాలు ఎవరైనా చనిపోయినపుడే వారి విలువ గుర్తిస్తారు. చనిపోయిన వ్యక్తికి కూడా తనను జనాలు ఎంతగా ప్రేమిస్తారో.. చనిపోయాకే తెలుస్తుంది అని వర్మ ట్వీట్ చేసారు.


కలాంజీ లాంటి గొప్ప వ్యక్తులకు మరణం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు'' అని ట్వీట్ చేశాడు వర్మ.

కలాం మృతి తనను కూడా చాలా బాధించిందని.. ఆయన మరణాన్ని ఇండియా ఎలా తట్టుకుని ముందుకు వెళ్తుందో తెలియట్లేదని వర్మ ట్వీట్ చేసారు.

English summary
"Great men like Kalamji can never die ..they will remain forever alive in the hearts of every Indian from Kashmir to Kanyakumari" Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu