twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వెన్నుపోటు’ వివాదం: థాంక్స్ చెబుతూ మళ్లీ రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ

    |

    వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'లక్ష్మిస్ఎన్టీఆర్' సినిమాలో వెన్నుపోటు సాంగ్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఎన్టీ రామారావు జీవితాన్ని బేస్ చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనేది చూపించబోతున్నారు.

    అయితే ఈ వెన్నుపోటు సాంగులో ఎన్టీ రామారావు అల్లుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోస్ ఎక్కువగా ఫోకస్ చేయడంతో తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబును కించపరిచే విధంగా ఈ సాంగ్ ఉందంటూ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాలపై వర్మ రియాక్ట్ అయ్యారు.

     వ్యూస్ పెంచారు, థాంక్స్

    వ్యూస్ పెంచారు, థాంక్స్

    ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని వెన్నుపోటు సాంగ్ మీద ఆందోళన చేపట్టిన, పోలీసులకు కంప్లయింట్ చేసిన, నా దిష్టబొమ్మను దహనం చేసిన వారికి థాంక్స్. ఎందుకంటే మీ వల్లే ఈ సాంగ్ వ్యూస్ పెరిగాయి'' అంటూ వర్మ ట్వీట్ చేశారు.

    ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదుపై

    ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదుపై

    చంద్రబాబు నాయుడును కించ పరిచే విధంగా పాట చిత్రీకరించిన రామ్ గోపాల్ వర్మపై తగిన చర్యలు తీసుకోవాలినే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన పోలీస్ కంప్లయింటుపై వర్మ రియాక్ట్ అవుతూ.... మీ కంప్లైంటుకు ఎగైనిస్టుగా నేను కూడా కంప్లైంట్ చేయబోతున్నట్లు తెలిపారు.

    సినిమా ఏ రేంజిలో ఉంటుందో?

    సినిమా ఏ రేంజిలో ఉంటుందో?

    సినిమాలో పాటే ఇంత వివాదానికి కారణమైతే... రేపు సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో? అనే అంశం హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వాస్తవాలు చూపించబోతున్నారో తెలుసుకోవడానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    లక్ష్మీ పార్వతి స్టోరీ...

    లక్ష్మీ పార్వతి స్టోరీ...

    ఎన్టీఆర్ జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్‌ మీద కుట్ర పన్ని ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించడం వెనక ఉన్నది ఎవరు? ఆ సమయంలో పార్టీ శ్రేణులతో, కుటుంబ సభ్యులతో రామారావు ఈక్వెషన్స్ ఎలా ఉన్నాయి? అనేది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చూపించే అవకాశం ఉంది.

    English summary
    "I thank all the protestors of #LakshmisNTR VennuPotu 🔪🔪🔪song who are lodging police complaints and burning my effigies🙏, because they are all increasing the song views." Ram Gopal Varma tweeted. An MLA named SV Mohan Reddy has filed a complaint against RGV in Kurnool police station. He said the song Vennupotu is defaming CM Chandrababu Naidu. Ram Gopal Varma tweeted out the complaint and wrote, "I am also going there to complain against the complaint (sic)."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X