twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ నిజంగానే రిస్క్ తీసుకుంటున్నాడా? , "వంగవీటి" వెనక సంగతులేమిటి?? (ఫొటో స్టోరీ)

    |

    వివాదాలనే సినిమాలు గా చేసే వర్మ ఇప్పుడు తెస్తున్న మరో సంచలనం "వంగవీటి" విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈసినిమా... అనౌన్స్ చేసిన మొదటి రోజునుంచే వివాదాల కెంద్ర బిందువయ్యింది. దాడులు చేస్తామంటూ ప్రత్యక్షంగా బెదిరింపులకు పాల్పడ్డా ఈ సినిమా తీయటానికి వెనుకాడలేదీ డేరింగ్ డైరెక్టర్. ఇప్పటికే సర్కార్, రక్త చరిత్ర... వంటి నిజజీవిత కథలతోనే ఎన్నొ బెదిరింపులనెదుర్కొంటూనే ఆ సినిమాలని పూర్తి చేసిన వర్మ ఇప్పుడు బెజవాడ చీకటి చరిత్రను తెరకెక్కిస్తున్నాడు.

    సినిమా ఎనౌన్స్ చేసిన సమయంలో వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ తెగ హడావిడి చేసిన వర్మ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఇక తెలుగు సినిమాలే చేయను అని చెప్పిన వర్మ వీరప్పన్ ధారుణమైన పరాజయం తో మళ్ళీ "వంగ వీటి" మీద దృష్టి పెట్టాడు. ఒక దశలో మకాం ముంబైకి మార్చేయటం, బాలీవుడ్ లో వీరప్పన్ సినిమా ప్రమోషన్ లో బిజీ కావటంతో వంగవీటి సినిమా ఆగిపోయినట్టే అని భావించారు. అయితే ఇప్పుడు వంగవీటి సినిమా షూటింగ్ పూర్తికావచ్చిందన్న వార్త తో వంగవీటి మళ్ళీ ముందుకు వచ్చింది.. ఎనౌన్స్ మెంట్ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా రిలీజ్ టైంకి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.

    సినిమా మొదలైన దగ్గరినుంచీ వర్మ తన వ్యూ ఏమిటో చెబుతూనే వస్తున్నాడు. ఒక్కో వ్యాఖ్యా ఒక్కొక్క సంచలనం అయ్యింది. విజయవాడలో ఉన్న అప్పటి రాజకీయాలని తెరకెక్కిక్కించ బోతున్నానంటూ అనౌన్స్ చేసిన దగ్గరి నుంచీ వర్మ ఏమేం చెప్పాడో ఫొటో స్టోరీ లో చూద్దాం...

    అదే తేడా

    అదే తేడా

    నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న "వంగవీటికి" ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా.

    ఫ్యాక్షనిజం కాదు రౌడీయిజం

    ఫ్యాక్షనిజం కాదు రౌడీయిజం

    రౌడీ యుజానికి..ఫ్యాక్షనిజానికీ మధ్యలో ఉన్న తేడా చూపించ బోతున్నా...పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు.తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు.ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు.

    చెప్పేదిదే

    చెప్పేదిదే

    ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటినుంచీ ఇప్పటివరకూ సాగుతూ వస్తున్న హింసచరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధి అయితే రౌడీ ఒక మలుపు.

    రౌడీయిజం చూపిస్తా

    రౌడీయిజం చూపిస్తా

    ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం.

    కత్తితో కూడా పొడిచి చెప్పగలను

    కత్తితో కూడా పొడిచి చెప్పగలను

    రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు, బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను.

    అదే సినిమా కథ

    అదే సినిమా కథ

    వంగవీటి రాధాగారు, చలసాని వెంకటరత్నం గారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే "వంగవీటి" చిత్రం

    రత్న కుమారి గారి కోసం

    రత్న కుమారి గారి కోసం

    వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు...కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను చాలా చాలా చాలా అన్వేషించాను..

    నైనా గంగూలి

    నైనా గంగూలి

    చివరికి ఆ కెపాసిటీ నాకు కనిపించింది నూతన నటి నైనా గంగూలిలో...హీరోయిన్ ల బట్టలిప్పాలనే మనస్తత్వమున్న వ్యక్తుల బట్టలు కూడా కేవలం తన కళ్ళలోని తీక్షణతో విప్పగలిగే కెపాసిటీ ఉన్న మహా సీరియస్ నటి నైనా గంగూలి.

    విజయవాడ గత చరిత్ర

    విజయవాడ గత చరిత్ర

    కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటి విజయవాడ వాతావరణాన్ని పునసృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని "వంగవీటి" నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని చూపించే సాహసాన్ని చేయ బోతున్నా...

    బతికి ఉన్న వాళ్ళు కూడా పాత్ర దారులే

    బతికి ఉన్న వాళ్ళు కూడా పాత్ర దారులే

    ఈ చిత్రం లో ఇప్పటికి చని పోయిన వారే కాదు ఇప్పుడు బతికి ఉన్న వాళ్ళు కూడా పాత్ర దారులే. సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని గొడవలకి కారణ భూతమౌతుందో.... చెప్పలేం.

    దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మ నాభంల పాత్ర

    దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మ నాభంల పాత్ర

    దేవినేని నెహ్రూ, గాంధీలతో పాటు దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మ నాభంల పాత్రలు కూడా ఈ సినిమాలో ఉండబోతూండటం తో మరింత సంచలనం కానుంది "వంగ వీటి"

    రామ్ గోపాల్ వర్మ అనే క్యారెక్టర్ కూడా

    రామ్ గోపాల్ వర్మ అనే క్యారెక్టర్ కూడా

    ఇదే సినిమాలో ఇంకో చమక్కేమిటంటే వర్మ నిజ జీవిత పాత్ర కూడా కనిపించటం. అంటే సినిమాలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది.

    వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు

    వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు

    వంగవీటి రాధా
    వంగవీటి మోహన రంగా
    వంగవీటి రత్నకూమారి
    దేవినేని నెహ్రు
    దేవినేని గాంధీ
    దేవినేని మురళి
    కర్నాటి రామమోహనరావు
    సిరిస్ రాజు
    రాజీవ్ గాంధీ
    దాసరి నారాయణ రావు
    ముద్రగడ పద్మనాభం
    నందమూరి తారక రామారావు
    రామ్ గోపాల్ వర్మ

    English summary
    Ram Gopal Varam is silently completing the shooting of his latest film ‘Vangaveeti’, which is based on the real life faction war between the Devineni and Vangaveeti families of Vijayawada. The movie’s shoot is reportedly coming to an end.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X