For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సినీ ఇండస్ట్రీకి రామ్ గోపాల్ వర్మ మేనకోడలు? ఫోటోస్ షేర్ చేసిన ఆర్జీవీ!

  |

  వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన ఎన్టీ రామారావు జీవితంలోని కాంట్రవర్సల్ కోణాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ద్వారా ప్రజల ముందుకు తేబోతున్నారు. రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, చివరి నిమిషంలో ఆయన ఎదుర్కొన్న మానసిక క్షోభ, వెన్ను పోటు పర్వం లాంటి కీలక అంశాలను ఇందులో చూపించబోతున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదలవుతున్న నేపథ్యంలో తన ట్విట్టర్ పేజీ ద్వారా కొన్ని రోజులుగా సినిమాను ప్రమోట్ చేస్తూ బీజీగా గడుపుతున్నారు. కాగా ఈ మూవీ ద్వారా వర్మ తన మేనకోడలిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

  వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ

  వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ

  తన మేనకోడలుతో కలిసి దిగిన ఫోటోలు వర్మ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వర్మ ఆమె కాస్టూమ్ డిజైనింగ్ టాలెంట్ గురించి పొగడ్తలు గుప్పించడం గమనార్హం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి శ్రావ్యవర్మ కాస్టూమ్ డిజైనర్‌గా పని చేసినట్లు సమాచారం.

  పోటీ పడి ఓడిపోయి

  పోటీ పడి ఓడిపోయి

  శ్రావ్యా వర్మతో కండలు ప్రదర్శించే విషయంలో పోటీ పడి, ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ వర్మ మరో ఫోటో షేర్ చేశారు. సాధారణంగా వర్మ నుంచి ఎప్పుడూ ఇలాంటి సరదా పోస్టులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన పోస్టులు కనిపించవు. ఉన్నట్టుండి ఇలాంటివి దర్శన మివ్వడంతో అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.

  కూతురు జ్ఞాపకాలతో...

  కూతురు జ్ఞాపకాలతో...

  తన కూతురుతో గడిపిన పాత రోజులను గుర్తు చేసుకుంటూ రామ్ గోపాల్ వర్మ మరో ఫోటో షేర్ చేశారు. తమ ఇద్దరి సంబంధాలు బావున్నప్పుడు తీసకున్న ఫోటో ఇది అని తెలిపారు. ఇపుడు తన కూతురు తనను అసహ్యించుకుంటోందంటూ కొన్ని రోజుల క్రితం వర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.

  లక్ష్మీస్ ఎన్టీఆర్

  లక్ష్మీస్ ఎన్టీఆర్

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివరాల్లోకి వెళితే... ఎన్టీ రామారావు పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామారావు చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం ఉంటుంది.

  దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ & అగస్త్య మంజు
  నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
  సినిమాటోగ్రఫీ : రమ్మీ
  రచన : రామ్ గోపాల్ వర్మ & నరేంద్ర చారి
  మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
  ఎడిటర్ : కమల్ ఆర్
  కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
  కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
  లిరిక్స్ : సిరా శ్రీ
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
  ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
  సౌండ్ డిజైన్ : యతి రాజు

  English summary
  Ram Gopal Varma tweeted a series of photos featuring him with his niece Shravya Varma in a restaurant. He captioned them with "With my amazingly talented costume designer niece ⁦shravyavarma⁩. My niece ⁦shravyavarma⁩ checking out her bicep with my tricep and she won. But me and shravyavarma eventually made up and she promised to apply her costume designing talent on dear old ME!"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more