»   »  నిర్మాతల దృష్టిలో రోటీన్ సినిమాలే సేఫ్...(రామ్ ఇంటర్వ్యూ)

నిర్మాతల దృష్టిలో రోటీన్ సినిమాలే సేఫ్...(రామ్ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ హీరోగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘నేను శైలజ'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. హీరో రామ్ చాలాకాలం తర్వాత రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమా చేసానని చెబుతున్నాడు. సినిమా గురించిన వివరాలతో పాటు, ఇతర విషయాలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.

శివమ్ నెగెటివ్ రిజల్టును దృష్టిలో పెట్టుకుని ‘నేను శైలజ'లో మార్పులు చేసారా? అనే ప్రశ్నకు రామ్ స్పందిస్తూ....అందులో మార్పులు చేయడానికి ఏమీ లేదు. శివం రిలీజయ్యే నాటికే ఆచిత్రం 90 శాతం షూటింగ్ పూర్తయింది. "బేసిక్‌గా నిర్మాతలు, పంపిణీదారులు రొటీన్ సినిమాలనే ఇష్టపడతారు. దానికి కారణం ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆడతాయి. అదే కాన్సెప్ట్ సినిమా మంచి టాక్ వచ్చినా ఆడదు. అందుకే అలాంటి సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు పెద్దగా ఇష్టపడరు. టాక్ మిగులుతుంది. సేఫ్టీ కోసం రొటీన్ సినిమాలు చేయాలనుకుంటారు. నాదగ్గరికి చాలా వరకు రొటీన్ కథలే వస్తాయి. కొన్ని మాత్రమే డిఫరెంటుగా ఉంటున్నాయి. ఆ కొన్నింటిలో నుండి నాకు సరిపోయే కథను ఎంచుకుంటున్నాను అన్నారు.


శివం పరాజయంపై స్పందిస్తూ...


శివం మూవీ పరాజయం పాలైనా ‘నేను శైలజ' విషయంలో కాన్ఫిడెంటుగానే ఉన్నాం. ఏ సినిమాకైనా కాన్ఫిడెంట్‌గానే ఉంటాం. మనం చేసిన మనకు బాగానే నచ్చుతుంది. అది ప్రేక్షకులకు కూడా నచ్చుతుందా? లేదా? అన్నదే పాయింట్. కొద్దికాలంగా నా సినిమాలు రొటీన్ అయిపోయాయనే టాక్ బాగా వినిపించింది. అందులో నిజం లేకపోలేదు. అందుకే నేను శైలజతో కొత్త ప్రయత్నం చేశా. ఈ సినిమా విషయంలో ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్‌గానే ఉన్నా అన్నారు.


హరికథ టైటిల్ మార్చడానికి కారణం?

హరికథ టైటిల్ మార్చడానికి కారణం?


‘హరికథ' అనే టైటిల్‌ను మొదట్నుంచీ కేవలం వర్కింగ్ టైటిల్‌గానే అనుకొని వచ్చాం. హరి గాడి కథ అనే అర్థం వచ్చేలా ఆ టైటిల్ అనుకున్నాం. కాని టైటిల్ అర్థం వేరేలా వస్తోంది. అందుకే ‘నేను.. శైలజ'ను ఫిక్స్ చేశాం.


సినిమా ఎలా ఉండబోతోంది?

సినిమా ఎలా ఉండబోతోంది?


ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య సాగే ఆసక్తికర ప్రేమకథే ఈ సినిమా. అందరూ తమ కథనే సినిమాలో చూస్తున్నట్లు ఫీలవుతారని కచ్చితంగా చెప్పగలను.


మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

మీ పాత్ర ఎలా ఉండబోతోంది?


ఈ సినిమాలో నేను హరి అనే ఓ డీజేగా కనిపిస్తా. సినిమా పూర్తిగా హరి, శైలజల లవ్ జర్నీ మీదే నడుస్తూంటుంది. ఇందులో అనవసరమైన పాటలు, అనవసరమైన ఫైట్లు ఉండవు. చెప్పాలంటే చాలాకాలం తర్వాత రొటీన్‌కు భిన్నంగా, రియలిస్టిక్‌గా ఉండే సినిమాను, పాత్రను చేశా.


కమర్షియల్ అంశాలు ఉన్నాయా?

కమర్షియల్ అంశాలు ఉన్నాయా?


సినిమా కథ పరంగా, యాక్టింగ్ పరంగా కూడా కమర్షియల్ హీరో హంగులేవీ లేవు. ఏ రకంగా చూసినా నేను శైలజలో నా పాత్ర, ఇది మన వాడి ప్రేమకథే కదా అనేలా ఉంటుంది.


మీ పెళ్లి గురించి చెప్పండి?

మీ పెళ్లి గురించి చెప్పండి?


ఇంకా పెళ్లి ఆలోచన లేదు. ఇంట్లో నాకంటే పెద్దవాళ్లు ఉండటంతో నాపై ఒత్తడి లేదు. ఇప్పటి వరకు నా మనసును టచ్ చేసే అమ్మాయి తారసపడలేదు. లవ్వా? అరేంజ్డ్ మ్యారేజా? అనేది తెలియదు.
English summary
Actor Ram interview about Nenu Sailaja movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu