రివ్యూకు 5 స్టార్ రేటింగ్ : అంత గొప్ప సినిమానా?

By Bojja Kumar

హైదరాబాద్: ఏ సినిమాకైనా 3/5 స్టార్ రేటింగ్ వచ్చిందంటే సినిమా ప్రేక్షక రంజకంగా ఉందని అర్థం. ఎంతో గొప్పగా ఉంటే తప్ప 4/5 రేటింగ్ రావడం కష్టం. కానీ 5/5 స్టార్ రేటింగ్ వస్తే? సినిమా ఏ రేంజిలో ఉందో అనే ఆసక్తి అందరిలోనూ కలుగక మానదు. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్-దీపిక పదుకొనె జంటగా తెరకెక్కిన 'రామ్ లీలా' చిత్రానికి కొందరు క్రిటిక్స్ వందకు వంద మార్కులు వేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

షేక్స్ పియర్ నవల రోమియో-జూలియట్ అనువర్తనంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'రామ్ లీలా' చిత్రాన్ని తెరకెక్కించారు. తుపాకులు, ప్రతీకారం బ్యాక్‌డ్రాప్‌లో సాగే హై ఓల్టేజ్ రొమాంటిక్ డ్రామా ఈ చిత్రం. ఈ చిత్రాన్నికి ఫిల్మ్ క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఈ చిత్రానికి 5/5 రేటింగ్ ఇస్తే...మరికొందరు 2.5/5 రేటింగుతో సరిపెట్టారు.

చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ సినిమాలో రణవీర్-దీపిక మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందని ప్రశంసించారు. సినిమాలోని సంగీతానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. చిత్రీకరణ బాగుంది. రామ్, లీలా మధ్య సాగే ప్రేమాయణమే ఈ చిత్రం. ఇరు కుటుంబాల మధ్య ద్వేషం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రేమికులు ఏం చేసారనేది కథ. ఎవరెవరు ఎంత రేటింగ్ ఇచ్చారు? అనేది స్లైడ్ షోలో...

టైమ్స్ ఆఫ్ ఇండియా

టైమ్స్ ఆఫ్ ఇండియా


ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా రామ్ లీలా చిత్రానికి 5/5 రేటింగ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో వీరు రామ్ చరణ్ ‘జంజీర్' చిత్రానికి కూడా భారీ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

ఇండియా టుడే

ఇండియా టుడే


మరో జాతీయ పత్రిక ఇండియా టుడే వారు ఈచిత్రానికి 4.5/5రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ కాస్త ఎక్కువే అనేది పలువురు ఆడియన్స్ వాదన. కొందరు మాత్రం సబబే అంటున్నారు.

బాలీవుడ్ హంగామా

బాలీవుడ్ హంగామా


ప్రముఖ బాలీవుడ్ సినీ అంతర్జాల పత్రిక ఈచిత్రానికి 4.5/5రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ కాస్త ఎక్కువే అనేది సినిమా చూసిన వారి అభిప్రాయం.

కోయ్‌మోయ్

కోయ్‌మోయ్


ప్రముఖ బాలీవుడ్ సినీ అంతర్జాలయ పత్రిక కోయ్‌మోయ్ వారు 3.5/5రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ కాస్త ఆమోదించ దగ్గదే అని పలువురు ఆడియన్స్ వాదన.

జీ న్యూస్

జీ న్యూస్


ప్రముఖ జాతీయ మీడియా జీ న్యూస్ వారు 3.5/5రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ కాస్త ఆమోదించ దగ్గదే అని పలువురు ఆడియన్స్ అభిప్రాయం.

బాలీవుడ్ లైఫ్

బాలీవుడ్ లైఫ్


ప్రముఖ బాలీవుడ్ అంతర్జాల పత్రిక బాలీవుడ్ లైఫ్ వారు 3/5 రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ కొంత వరకు ఆమోదించ దగ్గదే అని పలువురు ఆడియన్స్ అంటున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్

ఇండియన్ ఎక్స్‌ప్రెస్


ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ వారు ఈచిత్రానికి అతి తక్కువగా 2.5/5 అంటూ యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. అయితే మరీ ఇంత తక్కువ రేటింగ్ ఇవ్వదగ్గ సినిమా కాదనేది పలువురి వాదన.

మన ‘వన్ ఇండియా' రేటింగ్

మన ‘వన్ ఇండియా' రేటింగ్

మన ‘వన్ ఇండియా' క్రిటిక్స్ ఈచిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చారు. ఈ చిత్రానికి ఇది తగిన రేటింగే అని పలువురు సినీ గోయర్స్ చెబుతున్న మాట.
రివ్యూ కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X