Just In
- 13 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ: రామ్ కెరీర్‌లోనే తొలిసారి.. ఫస్టాఫ్ అలా.. సెంకండాఫ్ ఇలా.. మైనస్ ఇవే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. బడా నిర్మాత ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన అతడు.. చిన్న వయసులోనే ఎంతో కష్టపడి తనకంటూ సొంత ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఎనర్జిటిక్ యాక్టింగ్, అదిరిపోయే డ్యాన్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'రెడ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో షోలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో రామ్ మూవీ ట్విట్టర్ రివ్యూ మీకోసం!

భారీ హిట్ తర్వాత రామ్ అలా వచ్చాడు
‘ఇస్మార్ట్ శంకర్' వంటి భారీ హిట్ తర్వాత రామ్ పోతినేని నటించిన చిత్రం ‘రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సొంత బ్యానర్‌లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్లు మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్‌లు నటించారు. అలాగే, రామ్ తన సుదీర్ఘమైన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రభినయం చేశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు.

తగ్గిన థియేటర్లు.. అద్భుతమైన స్పందన
సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు సినిమాలకు విశేషమైన స్పందన ఉంటుంది. అయితే, ఈ సారి మన చిత్రాలను కాదని.. తమిళ పరిశ్రమకు చెందిన ‘మాస్టర్'కు ఎక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో రామ్ సినిమా చాలా తక్కువ ప్రాంతాల్లోనే విడుదల అవుతోంది. అయినప్పటికీ.. ఇప్పటికే షోలు పడిన చోట్ల ‘రెడ్' మూవీకి అద్భుతమైన స్పందన వస్తోంది.

రామ్ కెరీర్‌లోనే తొలిసారి.. అంతా అతడే
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. కెరీర్‌లో మొదటిసారి అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ‘రెడ్' మూవీ చూసిన వారంతా హీరో యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. వన్ మ్యాన్ షోలా మార్చేశాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు పాత్రలకు రామ్ చూపిన వేరియేషన్ హైలైట్‌గా ఉంటుందని చెబుతున్నారు.

క్లాస్ డైరెక్టర్ మాస్‌గా.. అతడు దంచేశాడు
గతంలో క్లాస్ సినిమాలనే చేశాడు దర్శకుడు కిశోర్ తిరుమల. అలాంటి డైరెక్టర్ ‘రెడ్'తో తొలిసారి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేశాడు. అయినప్పటికీ అతడు బాగా ఆకట్టుకున్నాడని అంటున్నారు. అయితే, స్క్రీన్‌ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని చెబుతున్నారు. ఇక, మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం దంచేశాడని తెలుస్తోంది.

ఫస్టాఫ్ అలా.. సెంకండాఫ్ ఇలా.. మొత్తంగా
ఓవర్సీస్‌లో గత రాత్రే ‘రెడ్' మూవీ ప్రీమియర్ షోలు పడ్డాడు. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బెన్‌ఫిట్ షోలు వేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాను చూసిన వారి అభిప్రాయం ప్రకారం.. ఫస్టాఫ్ సోసోగా రొటీన్ సీన్లతో బోరింగ్‌గా అనిపించిందట. సెకెండాఫ్ మాత్రం ఆకట్టుకుందని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా మాత్రం రామ్ ఫ్యాన్స్‌కు నచ్చుతుందని చెబుతున్నారు.

సినిమాకు మైనస్ అయిన అంశాలు ఇవే
‘రెడ్'లో కామెడీ అస్సలు వర్కౌట్ కాలేదని సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అలాగే, కొన్ని ముఖ్యమైన ట్విస్టులు ముందే ఊహించగలిగేలా ఉన్నాయని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా రొటీన్‌గా సాగుతుందని తెలిసింది. దర్శకుడు స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.