»   » కూతురుతో రాసలీలు? రా‌క్‌స్టార్ బాబాపై అల్లుడి ఆరోపణ

కూతురుతో రాసలీలు? రా‌క్‌స్టార్ బాబాపై అల్లుడి ఆరోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'డేరా సచ్చా సౌధా' అనే ఆధాత్మిక సంస్థ అధినేత, 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా హీరో..... రాక్ స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్టుతో ఉత్తరాది రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అతడిపై రేప్ కేసు రుజువుకావడంతో సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

తానే దేవుడిని అని చెప్పుకునే బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో మహిళలను బలవంతంగా లొంగదీసుకుని వారిపై అత్యాచారాలు చేశాడనే ఆరోపణలు రుజువు కావడంతో కటకటాల్లోకి వెళ్లాడు. అతడి అరెస్టు అనంతరం బాబా అనుచరులు హింసకు పాల్పడటంతో పదుల సంఖ్యలో పౌరులు మరణించారు.

బాబా మీద సంచలన ఆరోపణలు

బాబా మీద సంచలన ఆరోపణలు

బాబా మీద అతడి అల్లుడు విశ్వాస్ గుప్త సంచలన ఆరోపణలు చేశారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన కూతురు హనీప్రీత్‌తో రాసలీలలు జరిపాడని, దీన్ని నా కళ్లతో స్వయంగా చూశానని విశ్వాస్ ఆరోపించారు.

ఇన్నాళ్లు అందుకే...

ఇన్నాళ్లు అందుకే...

ఈ విషయం బయటకు చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని, అందుకే ఈ విషయాన్ని ఇన్నాళ్లు బయట పెట్టలేదని విశ్వాస్ గుప్తా మీడియాతో చెప్పుకొచ్చారు. ఇపుడు గుర్మీత్ బాబా అరెస్టు కావడంతో ఈ రహస్యాన్ని బయట పెట్టాడట.

హనీ‌ప్రీత్ దత్తత కూతురు

హనీ‌ప్రీత్ దత్తత కూతురు

హనీప్రీత్ సింగ్ అసలు పేరు ప్రియాంక. ఆమెనును డేరా బాబా దత్తత తీసుకున్నారట. బాబా జైలు కెళ్లడంతో ‘డేరా సచ్చా సౌధ' బాధ్యతలు హనీప్రీత్ తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఆమెపై ఈ ఆరోపణలు సంచలనం అయింది.

ఆమె కూడా జైల్లోకి రావాలంటున్న బాబా

ఆమె కూడా జైల్లోకి రావాలంటున్న బాబా

పోలీసు క‌స్ట‌డీలో ఉన్న బాబా తాజాగా వేసిన పిటిషన్‌ చర్చనీయాంశం అయంది. జైలులో తనతో పాటు తన కుమార్తె హనీప్రీత్‌ ఇన్సాన్‌ కూడా ఉండాలని గుర్మీత్‌ ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు. తన దత్తత కూతురు, తాను ఒకే జైల్లో ఉండాలనుకుంటున్నామని కోరారు. దీనిపై స్పందించిన‌ సీబీఐ న్యాయస్థానం.. అందుకు ఒప్పుకోలేదు. ఈ విష‌యంలో స‌ర్కారు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.

హనీ ప్రీత్ కూడా

హనీ ప్రీత్ కూడా

త‌న తండ్రికి నడుము నొప్పి, మైగ్రేన్‌ ఉందని ఆయనకి తరచూ ఆక్యూప్రెజర్‌ చేస్తుండాలని హనీప్రీత్ కూడా కోర్టును కోరింది. అంతేకాదు, తన కూతురిని జైలుకి రప్పించాలంటూ రోహ్‌తక్‌ జైలు అధికారులను గుర్మీత్‌ బాబా బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. త‌న మాట విన‌క‌పోతే జైలు అధికారులను సస్పెండ్‌ చేయిస్తానని కూడా అన్నారు.

Read more about: bollywood, బాలీవుడ
English summary
Gurmeet Ram Rahim wanted a woman companion in Rohtak jail. He had petitioned in the CBI court to let his adopted daughter Honeypreet stay with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu