Just In
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 1 hr ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 3 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
Don't Miss!
- News
Prabhas: బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు, స్కెచ్ అదిరింది, విదేశాల్లో షూటింగ్, చివరికి చాట మిగిలింది!
- Sports
పుజారా.. నువ్వు ఆ షాట్ ఆడితే సగం మీసం తీసేస్తా: అశ్విన్
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'పండగ చేస్కో' లో రామ్ క్యారక్టరైజేషన్
హైదరాబాద్: రామ్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్ మలినేని.

ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్, సోనాల్‌చౌహాన్ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రామ్, రకుల్, సోనాల్ తదితరులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
ఫిబ్రవరి 3 వరకూ హైదరాబాద్‌లోనే షూటింగ్ సాగుతుంది. ఆ తరవాత 'పండగ చేస్కో' బృందం రాజమండ్రి వెళ్తుంది. అక్కడ పచ్చటి పరిసరాల మధ్య ఓ కీలక షెడ్యూల్‌ని తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.
రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, సంపత్, రావు రమేష్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్, వెన్నెలకిశోర్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచన సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం: థమన్.ఎస్.ఎస్., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం.