Just In
- 3 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 23 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 28 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
- 31 min ago
పెళ్లి విషయం దాచిపెట్టడంపై కౌంటర్.. అందరి ముందు రవి పరువుదీసిన సుమ
Don't Miss!
- News
ఉద్యోగ సంఘాలు కూడా: సుప్రీంకోర్టులో సవాల్?: ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఆందోళన
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Automobiles
అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. టోలిచౌక్లో కోలాహలం! సాయత్రం మీడియాతో సమావేశం!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రశాంతంగా వెళ్లారు, రేపు అంత్యక్రియలు: హీరో వెంకటేష్
హైదరాబాద్: తన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతితో ఆయన కుమారుడు, తెలుగు సినీ హీరో వెంకటేష్ ముఖంలో విషాదం గూడు కట్టుకున్నట్లు కనిపించింది. బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన తన తండ్రి రామానాయుడు మరణించిన విషయాన్ని ప్రకటించారు. చాలా క్లుప్తంగా మాట్లాడి వెనుదిరిగారు.
నాన్నగారు ప్రశాంతంగా వెళ్లారని వెంకటేష్ అన్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు నాన్నగారు తుది శ్వాస విడిచినట్లు ఆయన తెలిపారు. రేపు గురువారం ఉదయం 9 గంటల నుంచి రామానాయుడి స్టూడియోలో అభిమానుల దర్శనార్థం నాన్నగారి భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

కాగా, రామానాయుడి స్వగ్రామం కారంచేడు నుంచి బంధువులు, అభిమానులు హైదరాబాదుకు బయలుదేరారు. తమ అభిమాన నిర్మాతను కడసారి చూడడానికి వారు హైదరాబాదుకు బయలుదేరారు. ప్రకాశం జిల్లా కారంచేడులో విషాద ఛాయలు నెలకొన్నాయి.
రామానాయుడు మించిన నిర్మాత తెలుగులో లేరు. చిత్ర సీమ అంతా ఆయనను విశేష గౌరవంతో ఆదరిస్తూ వచ్చారు. తన పేరు మీద ఓ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు ఆయన ఎన్నో అందుకున్నారు. ఓ నిర్మాతకు స్టార్ డమ్ రావడం రామానాయుడి విషయంలోనే జరిగింది.