For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫుల్ కామెడీ....( 'రామాచారి' ప్రివ్యూ)

  By Srikanya
  |
  హైదరాబాద్ : తొట్టెంపూడి వేణు, కమలిని ముఖర్జీ జంటగా జి. ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.వి.శ్యాంప్రసాద్ నిర్మిస్తున్న 'రామాచారి' చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. 'ఈడో పెద్ద గూఢచారి' అన్నది ఉపశీర్షిక. మళయాళ చిత్రం 'సీఐడీ మూసా' కి రీమేక్ ఇది.

  పోలీసు కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. అతగాడి పేరు రామాచారి. చిన్నప్పటి నుంచీ పోలీస్‌ అధికారి కావాలని కలలు కంటాడు. ప్చ్‌... అనుకున్నది సాధించలేకపోతాడు. చివరాఖరికి గూఢచారిగా మారతాడు.ఆ గూఢచారి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా కాపాడాడన్నదే కథ. అతను చేసే అన్వేషణలు కావల్సినంత వినోదాన్ని పంచుతాయి. హీరో లాంటి వ్యక్తి జీరోగా మారి.. తిరిగి హీరోగా మారడమే ఈ చిత్రం. ఈ క్రమంలో వచ్చే సంఘటనలు అందరినీ ఆకట్టుకొంటాయి.

  ఈ చిత్రం గురించి హీరో వేణు మాట్లాడుతూ... 'రామాచారి' సినిమాకి మాతృక మలయాళంలోని 'సీఐడీ మూసా'. అక్కడ మంచి విజయం సాధించింది. గతంలో నేను చేసిన 'హనుమాన్‌ జంక్షన్‌'కి మించి ఉంటుంది ఇందులోని వినోదం. ఈ సినిమా కోసం నేను హాలీవుడ్‌ హాస్య చిత్రాలను పరిశీలించాను. మిస్టర్‌ బీన్‌, పింక్‌ పాంథర్‌లా చిన్నారులను అలరించే పాత్ర ఇది. సినిమా విడుదలలో ఆలస్యమైన మాట నిజమే. దీనికి చాలా కారణాలున్నాయి. ' అన్నారు.

  దర్శకుడు ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ 'నేను దర్శకత్వశాఖలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో మలయాళంలో వచ్చిన 'సి.ఐ.డి మూస' చిత్రాన్ని ఇప్పుడు నా దర్శకత్వంలో 'రామాచారి'గా రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్థాయి వినోదభరిత చిత్రమిది' అన్నారు.

  నటీనటులు: బ్రహ్మానందం, ఆలీ, ఎల్.బి.శ్రీరామ్, గిరిబాబు, చంద్రమోహన్, రఘుబాబు, వేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, అమిత్, హర్షవర్ధన్, ఇందుఆనంద్, లిరిష తదితరులు
  మాటలు: వి.విక్రమ్‌రాజు, డొంగ్రత్, నాగరాజు, రైటర్ మోహన్,
  కథ: ఉదయ్‌కృష్ణ, సిబికె థామస్,
  పాటలు: రామజోగయ్యశాస్త్రి,
  సంగీతం: మణిశర్మ,
  ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్,
  కో ప్రొడ్యూసర్స్: బి.మురళి, పి.వి.నాగేశ్వరరావు,
  నిర్మాత: పి.వి.శ్యాంప్రసాద్,
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి.

  English summary
  
 Venu and Kamilini Mukherjee are acting as the lead pair in a film titled 'Ramachari'. 'Veedo Peddha Goodachari' is the tagline of the film. 'Siddhu from Seekakulam' fame G.V.Eswar is the director of this film.The release of the film has been delaying for a long time and at last the releasing today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X