»   » ఫ్యాన్స్‌ ఉంటేనే ఇష్టం, కానీ..(ఆడియో వేడుకలో ఎన్టీఆర్)

ఫ్యాన్స్‌ ఉంటేనే ఇష్టం, కానీ..(ఆడియో వేడుకలో ఎన్టీఆర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఎన్టీఆర్ సరసన సమంత, శృతి హాసన్ హీరోయిన్లు. తమన్ సంగీతం అం ఈచిత్రం ఆడియో వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సింపుల్ గా సాగింది.

ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ...అభిమానుల మధ్య సందడిగా ఆడియో వేడుక జరుపుకోవడం అంటేనే ఇష్టం, కానీ మధ్య జరిగిన సంఘటన వల్ల ఈ చిత్రం ఆడియో వేడుకను సింపుల్‌గా ప్లాన్ చేసాం, అభిమానులు ఇంట్లో కూర్చొని చూస్తే హ్యాపీగా భావిస్తాను' అన్నారు.

నాలోని రకరకాల టాలెంటును నా దర్శకులే ఆవిష్కరించారు. వినాయక్ నేను తొడగొట్టగలనని ఆదితో, కామెడీ చేయగలనని అదుర్స్‌తో నిరూపించారు. రాజమౌళి గొడ్డలి పట్టుకోగలనని సింహాద్రితో, ఎమోషనల్‌గా చేయగలనని కృష్ణ వంశఈ రాఖీతో, స్టైలిష్‍‌గా కనిపించగలనని వంశీ పైడిపల్లి 'బృందావనం'తో చూపించారు. నేను అమ్మాయిలను టీజ్ చేయగలనని, యూత్ ఫుల్‌గా చేయగలనని హరీష్ శంకర్ ఈ చిత్రంలో చూపించారు...అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

మిగతా వివరాలు, ఆడియో వేడుక సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

రామయ్యా వస్తావయ్యా

రామయ్యా వస్తావయ్యా


రామయ్యా వస్తావయ్య ఆడియో వేడుకకు సినీ పరిశ్రమలోని పలువురు దర్శకులు, నిర్మాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు వివి వినాయక్ సీడినీ ఆశిష్కరించి రాజమౌళికి అందజేసారు.

హరీష్ శంకర్

హరీష్ శంకర్


ఎన్టీఆర్ వయసులో మాత్రమే చిన్న వాడు. కానీ టాలెంట్ విషయంలో చాలా పెద్దవాడు. డైలాగ్స్, డాన్స్, పంచ్ ఇలా ఏ విషయాన్నయినా ఈజీ చేస్తాడు. సింగిల్ టేక్ లో చేస్తాడు. అలాంటి హీరోతో పని చేసినందుకు గర్వంగా ఉంది అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...


మా సంస్థలో రామయ్యా వస్తావయ్యా మూవీ ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. జూ ఎన్టీఆర్ సరికొత్తగా కనిపిస్తారు. హరీష్ శంకర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

రాజమౌళి

రాజమౌళి


‘సినిమాను నాకు చూపించారు. అద్భుతంగా ఉంది. దిల్ రాజు కథను మాత్రమే నమ్మి సినిమాను తీస్తారు. అందకే ఆయన సక్సెస్ ఫుల్ నిర్మాత అయ్యాడు. తారక్ ను వినయ్, నేను టైగర్ లా చూపించాం. వంశీ యంగ్ గా చూపించాడు. హరీష్ శంకర్ యంగ్ టైగర్ లా చూపించాడు' అని రాజమౌళి చెప్పారు.

వివి వినాయక్

వివి వినాయక్


‘హరీష్ శంకర్‌కి సినిమాలంటే పిచ్చి...ఆయన మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నా సినిమా ఆడియో ఫంక్షన్ లా ఉంది. అందరూ నాతో పని చేసినవాళ్లే. మేమంతా ఎన్టీఆర్‌కి కత్తులిచ్చాం. హరీష్ శంకర్ మాత్రం కాలేజీకి పంపించాడు.' అని వినాయక్ తెలిపారు.

థమన్ మాట్లాడుతూ...

థమన్ మాట్లాడుతూ...


‘ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఏ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలన్నా టీం వర్క్ ముఖ్యం. హరీష్ శంకర్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేసాడు. పెద్ద హిట్టవుతుంది.' అని తమన్ చెప్పుకొచ్చారు.

చోటా కె నాయుడు

చోటా కె నాయుడు


‘హరీష్ శంకర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండీ తెలుసు. మంచి ఎనర్జీ, సినిమా పట్ల ఫాషన్ ఉన్న వ్యక్తి. సినిమాలో తారక్ చాలా అందంగా కనిపించాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు.

10న విడుదల

10న విడుదల


రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేసేందుక సన్నాహాలు చేస్తున్నారు. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం

తారాగణం


జూ ఎన్టీఆర్, సమత, శృతి హాసన్, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ తదితరులు నటించారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సంగీతం :థమన్, కెమెరా : చోటా కె నాయుడు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, స్క్రీన్ ప్లే రైటర్స్: రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, చీఫ్ కోడైరెక్టర్ : యల్.పి.రామారావు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, డాన్స్ : దినేష్, గణేష్, శేఖర్, భాను, లిరిక్స్ : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, కో ప్రొడ్యూసర్స్ : శిరీష్, లక్ష్మణ్, నిర్మాత : దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం : హరీష్ శంకర్.

English summary
Jr NTR's upcoming film 'Ramayya Vasthavayya' audio lanched. The film will hit the screens on October 10th. Director Harish Shankar and Producer Dil Raju officially revealed the release date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu