»   » కర్ణాటకలో జూ.ఎన్టీఆర్ హంగామా

కర్ణాటకలో జూ.ఎన్టీఆర్ హంగామా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదారాబాద్ : ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి కర్ణాటకలోని శ్రీరామపట్నంలో జరుగుతోంది. మైసూర్ కు నలభై కిలోమీటర్ల దూరంలో మెల్ కోట గుడి దగ్గరలో ఈ ఎన్టీఆర్ పై ఇంపార్టెంట్ సన్నివేశాలు తీస్తున్నారు.


అలాగే ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్..కేరళలలో జరగనుంది. జూన్ 25 నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. అక్కడ చిత్రంలో మేజర్ సీన్స్ షూట్ చేసుకుని వస్తారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

మరోసారి ఎన్టీఆర్‌ వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రమిది. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత. సమంత హీరోయిన్. శ్రుతిహాసన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.


నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్‌, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.

English summary
NTR,Shruthi Hassan's ‘Ramayya Vastavayya’ will be starting its new schedule from today at Srirampatnam,Karnataka. It is near Melkota Temple which is 40 KMs away from Mysore. The film's next schedule will be in Kerala from 25th June. Harish Shankar is directing the film on Sri Venkateswara Creations banner. Dil Raju is producing it. Thaman is the music director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu