»   » సురేష్ బాబు నాలా కాదు

సురేష్ బాబు నాలా కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సురేష్‌ నాకంటే కచ్చితంగా ఉంటాడు. నేను మొహమాటం కొద్దీ సినిమాలు ఒప్పుకొని డబ్బులు పోగొట్టుకొన్న సందర్భాలున్నాయి. సురేష్‌ అలా కాదు... 'రూపాయి కూడా పోకూడదు డాడీ. రిస్క్‌ తీసుకోలేను' అంటాడు అంటూ చెప్పుకొచ్చారు రామానాయుడు. ఆయన తన తాజా చిత్రం ముగ్గురు ప్రమోషన్ లో కలిసిన మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.అలాగే ఇప్పటి నిర్మాత పరిస్ధితి మారిపోయిందని చెప్తూ... అప్పుడు నిర్మాతకు బాధ్యతలెక్కువ. సినిమా పోతే పంపిణీదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. అందుకే కథ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు. ఓ దర్శకుడు, ఓ నిర్మాత కలిసి హీరోని వెతికేవారు. ఇప్పుడు అలా కాదు... హీరో, నిర్మాత కలిసి దర్శకుడిని వెతుకుతున్నారు. నిర్మాత చెక్కుల మీద సంతకాలు చేయడానికి మాత్రమే కాదు.కథలో అతని ప్రమేయం తప్పకుండా ఉండాలి అన్నారు.రామానాయుడు నిర్మించిన 140వ చిత్రం 'ముగ్గురు'. ఈ నెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వియన్ ఆదిత్య దర్శకత్వంలో 'ముగ్గురు'రూపొందింది.

English summary
Dr.D. Ramanaidu’s production venture Mugguru is gearing up for its release on 19th August. The film casts Navdeep, Happy days fame Rahul, Avasarala Srinivas in the male leads and Shraddha Das, Sanjana and Soumya in the female leads. Sivaji and Reema Sen will appear in cameos in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu