twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పార్టీని టార్గెట్ చేసిన రామారావు.. అదేం లేదు.. షో టైంకి వచ్చేయమంటున్న యూనిట్!

    |

    రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుంచి ఒక 22 సెకండ్ల వీడియో లీకైన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రవితేజ నోట పలికిన డైలాగులు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీని టార్గెట్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదేమీ లేదంటూ సినిమా దర్శకుడు శరత్ మండవ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

     దర్శకుడిగా

    దర్శకుడిగా

    రవితేజ హీరోగా నటించిన రామారావు అని డ్యూటీ 29వ తేదీ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ సినిమాలో రవితేజ ఒక డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా అన్వేషీ జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. గతంలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలకు పని చేసిన శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.

     రంగంలోకి

    రంగంలోకి

    ఈ మధ్యకాలంలో విభిన్నమైన సినిమాలు చేస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను రవితేజతో కలిసి రవితేజ టీం వర్క్స్ బ్యానర్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకి కొద్ది గంటల ముందు రవితేజ పవర్ఫుల్ డైలాగులు పలుకుతున్న 22 సెకండ్ల వీడియో ఒకటి లీక్ అయింది. ఆ లీకైన సీన్లో డైలాగులు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీని ఉద్దేశించి పలికినవే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా దర్శకుడు శరత్ మండవ రంగంలోకి దిగారు.

    రాజకీయాలే లేవంటూ

    రాజకీయాలే లేవంటూ

    ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతున్న దని దానికి కొంత పొలిటికల్ టచ్ ఉండడం వాస్తవమే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా కానీ సీన్లు కానీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ఏమాత్రం పోలి ఉండవని ఇది మనుషులు మిస్ అయిన ఒక థ్రిల్లర్ సినిమా అని పేర్కొన్నారు. అసలు మా సినిమాలో రాజకీయాలే లేవంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మరోపక్క సినిమా యూనిట్ కూడా ఒక నోట్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది.

     మిస్ అవ్వకుండా

    మిస్ అవ్వకుండా

    సినిమా ప్రేమికులు అలాగే మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ ఈ లేఖను రాశారు. సాధ్యమైనంతవరకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా థియేటర్లకు రావాలని అలా వస్తేనే సినిమా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సినిమా ప్రారంభం మొదలు క్లైమాక్స్ వరకు మిస్ అవ్వకుండా చూడాలని ఫస్ట్ సీన్ చాలా క్రిటికల్స్ అని అది చూస్తేనే సినిమా అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. షో సమయానికి ఉండాలని కోరారు.

     కుటుంబంతో కలిసి

    కుటుంబంతో కలిసి

    అంతేకాక సినిమాలో ట్విస్టులు గానీ ఇతర సీన్స్ గాని సినిమా చూసిన తర్వాత ఎవరికీ రివీల్ చేయద్దని ప్రతి ఒక్కరు థియేటర్లోనే సినిమా చూసి ఆ త్రిల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్లుగా సినిమా యూనిట్ ప్రకటించింది. సినిమాని మీ స్నేహితులతో కుటుంబంతో కలిసి చూడాలని కూడా సినిమా యూనిట్ కోరింది. మరి చూడాలి రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఎలా ఉండబోతోంది అనేది.

    English summary
    Ramarao on duty director clarity on leaked scene and says no politics involved in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X