»   » ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ రిలీజైంది

ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ రిలీజైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్వకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలోని ఒక సాంగ్ రిలీజైంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత అనంత శ్రీరామ్ కలిసి 'జాబిల్లి నువ్వే చెప్పమ్మా' అనే పాటను విడుదల చేసారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...మిగిలిన పాటలను వచ్చే వారం సెప్టెంబర్ 8న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్పెయిన్లో పాటల చిత్రీకరణ జరుగుతోందని వెల్లడించారు. మేం విడుదల చేసిన తొలి టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మిరపకాయ్, గబ్బర్ సింగ్ తర్వాత హాట్రిక్ సక్సెస్ కొట్టడానికి హరీష్ శంకర్ సిద్ధం అవుతున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ...'బృందావనం, బాద్షా తర్వాత ఎన్టీఆర్‌తో నాకు హాట్రిక్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. హరీష్ శంకర్ నా నుంచి మంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు. త్వరలోనే అన్ని పాటలను విడుదల చేస్తాం, అందరికీ నచ్చే విధంగా ఆడియో ఉంటుంది' అన్నారు.

గతంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి పాటలు రాసాను. సీతమ్మ ఆశీస్సులు దక్కాయి. ఇప్పుడు రామయ్య ఆశీస్సుల కోసం సిద్దం అవుతున్నాను. జాబిల్లీ నువ్వే చెప్పమ్మా అనే సానుకూల దృక్ఫథంతో సాగే పాటను రాసాను' అని అన్నారు.

కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ తదితరులు నటించిన ఈచిత్రానికి కెమెరా : చోటా కె.నాయుడు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ : బ్రహ్మకడలి, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, నృత్యాలు : దినేష్, గణేష్, శేఖర్ బాను, పాటలు : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, సంగీతం : థమన్, సహ నిర్మాతలు : శిరీష్ లక్ష్మణ్, కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్.

English summary
Jr NTR's Ramayya Vastvayya directed by Harish Shankar, of Gabbar Singh fame is getting ready. Meanwhile the producer Dil Raju is planning for its audio launch on September 8 in Hyderabad. The film has music by Thaman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu