80 ఏళ్ల సినిమా చరిత్రలో ఈ క్రెడిట్ నాకే ... :దిల్ రాజు

By Srikanya

హైదరాబాద్ :''ఈ ఏడాది సంక్రాంతికి మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'ని ప్రేక్షకులకు అందించాను. ఈ దసరాకి 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని అందించనున్నాను. ఇంకా ఈ ఏడాది రెండు పెద్ద పండగలున్నాయి. రైట్ రిలీజ్ కోసం చూసి, ఈ సంవత్సరమే 'ఎవడు' కూడా రిలీజ్ చేసేస్తా. ఒకే ఏడాది నలుగురు అగ్రహీరోల సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఘనత సొంతం చేసుకున్నాను. ఓ విధంగా 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ క్రెడిట్ దక్కింది నాకే అనుకుంటా'' అని దిల్ రాజు అన్నారు.

ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడారు. ''దసరా కానుకగా మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కొత్తబంగారు లోకం, బృందావనం. రెండూ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం. ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోతో రెండో సారి సినిమా చేయడం ఆనందంగా ఉంది.

ఈ చిత్రం ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ లుక్‌కి ప్రపంచ వ్యాప్తంగా స్పందన లభిస్తోంది. రవితేజకు 'మిరపకాయ్', పవన్‌కల్యాణ్‌కి 'గబ్బర్‌సింగ్' లాంటి విజయాలనిచ్చిన హరీష్ తప్పకుండా ఎన్టీఆర్‌కి కూడా ఆ స్థాయి విజయాన్ని ఇస్తాడని నా నమ్మకం. ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ఎంటర్‌టైనర్ ఇది. ఈ వారంలో సెన్సార్ కూడా పూర్తవుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం'' అని చెప్పారు. ''క్లారిటీ ఉన్న నిర్మాత దిల్‌రాజు. మేకింగ్ అంటే ఏంటో పక్కన కూర్చోబెట్టి చూపించాడు తను. ఆయన సంస్థ విలువ పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ చాలా ఫ్రెష్‌గా ఉంటాడు.

'రామయ్యా వస్తావయ్యా' టైటిల్‌లో సాఫ్ట్‌నెస్. ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగుల్లో రఫ్‌నెస్. కథాపరంగా ఎన్టీఆర్ యువజన నాయకుడని సమాచారం. లుక్ పరంగా మాత్రం చాక్లెట్‌బోయ్‌లా అనిపిస్తున్నాడు. భిన్నంగా గోచరిస్తున్న ఈ అంశాలన్నీ సినిమాపై ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు దర్శకుడు హరీష్‌శంకర్. నిర్మాత 'దిల్'రాజు కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరో విషయం ఏంటంటే... ప్రేక్షకుల ఊహకందని ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో ఉందని సమాచారం. దాన్ని దర్శక, నిర్మాతలు గోప్యంగా ఉంచారని వినికిడి. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖ రామన్, రవిశంకర్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X