twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో నేడే

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శృతి హాసన్ కథానాయికలు. థమన్ ఈచిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆడియో విడుదల రేపు(సెప్టెంబర్ 21) జరుగనుంది.

    ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...'మా నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌లో 2008 అక్టోబర్ 9న 'కొత్తబంగారు లోకం', 2010 అక్టోబర్ 14న 'బృందావనం' విడుదలయి సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు 2013 అక్టోబర్ 10న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్‌తో హాట్రిక్‌కి సిద్ధమవుతున్నాము' అన్నారు.

    ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తీరు తెన్నులు కొత్తగా తీర్చిదిద్దారని, తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయని, ఆడియోని సెప్టెంబర్ 21న లక్షలాది నందమూరి అభిమానుల సమక్షంలో విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఛోటా కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని తెలిపారు.

    ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని, బృందావనం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయిన ఎన్టీఆర్ ఈ చిత్రంతో యూత్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువవుతారని దిల్ రాజు తెలిపారు.

    కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం :థమన్, కెమెరా : చోటా కె నాయుడు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, స్క్రీన్ ప్లే రైటర్స్: రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, చీఫ్ కోడైరెక్టర్ : యల్.పి.రామారావు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, డాన్స్ : దినేష్, గణేష్, శేఖర్, భాను, లిరిక్స్ : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, కో ప్రొడ్యూసర్స్ : శిరీష్, లక్ష్మణ్, నిర్మాత : దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం : హరీష్ శంకర్.

    English summary
    Jr NTR's upcoming film 'Ramayya Vasthavayya' audio releasing on Sep 21st. The film will hit the screens on October 10th. Director Harish Shankar and Producer Dil Raju officially revealed the release date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X