»   » ‘రామయ్యా వస్తావయ్యా’ పై అది రూమరే

‘రామయ్యా వస్తావయ్యా’ పై అది రూమరే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్‌ హీరోయిన్స్. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు నిర్మాత. ఈ చిత్రం ఈ రోజు(సోమవారం)సెన్సార్ పంపుతున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ పూర్తైందని,యు/ఎ సర్టిఫికేట్ వచ్చినదనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ నిజం కాదు,రూమర్ అనీ చెప్తున్నారు. డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ తో రిలీజ్ కు రెడీ అవుతుంది.


కెరీర్ మొదటి నుంచి ప్రతీ సినిమాలో కొత్త ఎన్టీఆర్‌ కనిపించాడు. తొడగొట్టాడు, గొడ్డలి పట్టాడు, కన్నీరు కార్చాడు, నవ్వాడు, నవ్వించాడు, స్లిమ్‌ అయ్యాడు, లవర్‌బోయ్‌లా మారాడు - ఎన్నో చేశాడు. తనని తాను మార్చుకొన్న ప్రతిసారీ ఎన్టీఆర్‌కి విజయం దక్కింది. ఇప్పుడు 'రామయ్యా... వస్తావయ్యా'లోనూ ఎన్టీఆర్‌లో ఛేంజ్‌ కనిపిస్తోంది. ఓ కాలేజీ కుర్రాడిలా మారిపోయాడు. అభిమానుల బిరుదుకి తగ్గట్టు 'యంగ్‌ టైగర్‌'లా మారిపోయాడు. సమంత, శ్రుతిహాసన్‌ హీరోయిన్స్ గా నటించారు. వీరిద్దరూ ఈ సినిమాకి సరికొత్త గ్లామర్‌ సొబగులు అందిస్తారనడంలో సందేహం లేదు.

'రామయ్యా వస్తావయ్యా' ట్రైలర్‌ చూసి... ''వినాయక్‌, నేనూ ఎన్టీఆర్‌ని టైగర్‌లా చూపించాం, వంశీపైడిపల్లి యంగ్‌ లుక్‌ ఇచ్చాడు. హరీష్‌ శంకర్‌ యంగ్‌ టైగర్‌లా మార్చాడు'' అంటూ రాజమౌళి కూడా కితాబిచ్చేశారు. ఎన్టీఆర్‌లో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఎవరైనా ఇట్టే లొంగిపోతారు. ఒక్కసారి ఎన్టీఆర్‌తో పనిచేస్తే చాలు మళ్లీ మళ్లీ చేయాలనుకొంటారు. హరీష్‌ శంకర్‌ పరిస్థితీ ఇలాగే ఉంది. ''ఎన్టీఆర్‌లాంటి నటుడు మళ్లీ పుట్టడు. డాన్స్‌లు చేయడంలో, సంభాషణలు పలకడంలో ఆయన్ని మించిన హీరో లేడు..'' అని మురిసిపోతున్నారు హరీష్‌.

'గబ్బర్‌సింగ్‌' తరవాత హరీష్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తమన్‌ అందించిన పాటలు, కట్‌ చేసిన ట్రైలర్‌ ఈ సినిమాపై పెట్టుకొన్న ఆశల్ని రెట్టింపు చేశాయి. ''మీరు ఎన్ని అంచనాలు పెట్టుకొనైనా థియేటర్లకు రండి. సినిమా చూశాక అందరూ 'ఇది సూపర్‌హిట్‌' అంటారు. ఆ గ్యారెంటీ నాది..'' అని నిర్మాత దిల్‌రాజు కూడా భరోసా ఇస్తున్నారు.

English summary
NTR’s Ramayya Vasthavayya has completed all the post production activities and is all set to go for censor certification today. Inspite of the disturbances in the state, Dil Raju is planning to go ahead with the release as scheduled on Oct 10th. Meanwhile there were rumours floating around saying that the movie was awarded a U/A certificate, which is false news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu