»   » 'రామయ్యా వస్తావయ్యా' డిజిటల్ రికార్డ్

'రామయ్యా వస్తావయ్యా' డిజిటల్ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్'రాజు నిర్మిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' . ఈ చిత్రం సాంగ్ ప్రోమోని గత నెల 31న విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే పది లక్షల మంది ఈ ప్రోమోని చూసి డిజిటల్ రికార్డ్ ని నమోదు చేసారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసారు.

నిర్మాత రాజు మాట్లాడుతూ ' సాంగ్ ప్రోమోని విడుదల చేసిన మూడు రోజులకే యూట్యూబ్ ఛానల్‌లో పది లక్షల మంది చూడటంతో ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజిటల్ రికార్డ్ నమోదయింది. హీరోల కేరెక్టరైజేషన్స్‌ని విభిన్నంగా చూపించే దర్శకుడు హరీశ్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్స్‌లో విజిల్స్ వేసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ' అన్నారు.

అలాగే టీజర్‌లో విడుదల చేసిన 'జాబిల్లి నువ్వే చెప్పు' పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు కొత్తగా ఉన్నాయని అందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు థమన్ స్వరపరిచిన పాటలను త్వరలో, సినిమాని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యూట్యూబ్‌లో రామయ్య టీజర్‌ని పదిలక్షల జనం చూడడం సంతోషంగా ఉంది. 'సింహాద్రి'తో మాస్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన ఎన్టీర్‌ 'బృందావనం'తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు రామయ్యగా టాలీవుడ్‌లో అన్ని రికార్డులు తిరగరాస్తాడు. థియేటర్లలో అభిమానుల విజిల్స్‌ పడడం ఖాయం. టీజర్‌లో జాబిల్లి నువ్వే .. బాగా పాపులరయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌ లుక్స్‌ కొత్తగా ఉన్నాయని అంతా చెప్పుకోవడం విశేషం. ' అని తెలిపారు.


'రామయ్య వస్తావయ్యా!' చిత్రంలోని ఎన్టీఆర్‌ డైలాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, దీనిపై దర్శకుడు హరీష్‌శంకర్‌ ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని అంటున్నారు. ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ తాజా చిత్రంలో సమంత, శృతిహాసన్‌ నాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. లోగడ ఎన్టీఆర్‌తో 'బృందావనం' వంటి కుటుంబ కథాచిత్రాన్ని తీసిన దిల్‌రాజు దీనిని హైఓల్టేజ్‌ డ్రామాతో కనువిందుగా నిర్మిస్తున్నారు.

'మిరపకాయ్‌, గబ్బర్‌సింగ్‌' చిత్రాలతో అందరిదృష్టిని ఆకర్షించిన హరీష్‌శంకర్‌ ఈ చిత్రాన్ని అంచనాలకు తగ్గట్టుగా రూపొందించేందుక ు ప్రయత్నిస్తున్నట్లు, ఇందులోని డైలాగులు కూడా బాగా పేలుతాయని అంటున్నారు. యూత్‌, మాస్‌, ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఈ మధ్యనే ఎన్టీఆర్‌, సమంతల కాంబినేషన్‌లో అద్భుతమైన వినోదాత్మక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారని తెలిసింది. గద పట్టుకుని నిలుచున్న ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదలచేయగా, దానికి విశేషమైన స్పందన లభించింది.

కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ తదితరులు నటించిన ఈచిత్రానికి కెమెరా : చోటా కె.నాయుడు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ : బ్రహ్మకడలి, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, నృత్యాలు : దినేష్, గణేష్, శేఖర్ బాను, పాటలు : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, సంగీతం : థమన్, సహ నిర్మాతలు : శిరీష్ లక్ష్మణ్, కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్.

English summary
Now a days the stamina of the trailers are being caliculated by its views count in youtube, Recently Attarintiki daredi and 1 Nenokadine has smashed the records of Youtube and now NTR came up with the another sensation, His latest song " Jabilli Nuvve cheppamma" from the movie Ramayya vasthavayya has been released as a sudden surprise to the NTR fans on 31st August,2013 and with in Just 3 Days this trailer got 1 Million views in the youtube. It is a new record in NTR’s film career, This movie is directed by Harish Shankar and produced by Dil Raju under his home banner Sri Venkateswara Creations.Samantha and Shruthi Hassan are the Heroins of this film, Music by Thaman
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X