»   » ‘రామయ్యా వస్తావయ్యా’ ట్రైలర్ టాకేంటి?(వీడియో)

‘రామయ్యా వస్తావయ్యా’ ట్రైలర్ టాకేంటి?(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం వచ్చే నెలలో విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. జూనియర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈచిత్రంలో కాలేజీ కుర్రాడిలా, ఎంతో అందంగా కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే మిరపకాయ్, గబ్బర్ సింగ్ చిత్రాలతో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించాడని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. హీరో ఎన్టీఆర్ కూడా హరీస్ శంకర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు....ఈ సినిమా తన కెరీర్లో మరిచిపోలేని మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

ట్రైలర్ చూడటం కోసం ఫోటోపై క్లిక్ చేయండి

Ramayya Vasthavayya

జూనియర్ ఎన్టీఆర్ ఇటు యాక్షన్ సీన్స్ తో పాటు, డాన్స్ విషయంలోనూ మరోసారి తన తడాఖా చూపాడు. ఎన్టీఆర్ ఎనర్జీకి తగిన విధంగా డైలాగుల విషయంలో హరీష్ శంకర్ మరోసారి తన స్టామినా చాటాడని స్పష్టం అవుతోంది. సినిమా విడుదలకు మరో రెండు వారాలు సమయం ఉండటంతో నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత, శృతి హాసన్ కథానాయికలు. థమన్ ఈచిత్రానికి సంగీతం సమకూర్చారు. అక్టోబర్ 10న సినిమా విడుదలవుతోంది. కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంగీతం :థమన్, కెమెరా : చోటా కె నాయుడు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, స్క్రీన్ ప్లే రైటర్స్: రమేష్ రెడ్డి, సతీష్వేగేశ్న, తోట ప్రసాద్, చీఫ్ కోడైరెక్టర్ : యల్.పి.రామారావు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, డాన్స్ : దినేష్, గణేష్, శేఖర్, భాను, లిరిక్స్ : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, కో ప్రొడ్యూసర్స్ : శిరీష్, లక్ష్మణ్, నిర్మాత : దిల్ రాజు,కథ-మాటలు-దర్శకత్వం : హరీష్ శంకర్.

English summary
'Ramayya Vasthavayya' Theatrical Trailer released. Ramayya Vastavayya is a Telugu film written and directed by Harish Shankar. The film is produced by Dil Raju under their Sri Venkateswara Creations banner, and will star Jr. NTR, Samantha and Shruti Haasan in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu