»   » రామ్ చరణ్ అఫీషియల్ గా ప్రకటన 31న

రామ్ చరణ్ అఫీషియల్ గా ప్రకటన 31న

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: రామ్‌ చరణ్‌ తేజ్‌ విమానయాన సంస్థ 'టర్బో మేఘా' చిహ్నాన్ని (లోగో) ఈనెల 31న ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తమిళనాడులోని పొలాచ్చిలో గోవిందుడు అందరి వాడేలే షూటింగ్‌లో ఉన్నారు. విమానయాన వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి తనను ఆకర్షించిన అంశాలను ఆయన ఆ రోజున వివరించే అవకాశం ఉంది. పెట్టుబడులు, సేవలు, భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.

  అత్యంత పోటీ ఉండడంతో పాటు.. ఇబ్బందుల ల్లో ఉన్న విమానయాన రంగంలోకి రామ్‌చరణ్‌ అడుగు పెట్టడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభుత్వ విధానాలు, మధ్య తరగతి ఆదాయాలు పెరుగుతుండడం వంటి సానుకూల అంశాలతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. అందువల్ల రామ్‌ చరణ్‌ ఈ రంగాన్ని ఎంచుకుని ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

  హైదరాబాద్‌ కేంద్రంగా 2013 మార్చి 14న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నమోదైంది. ఈ సంస్థ డైరెక్టర్లుగా కొణిదెల రామ్‌చరణ్‌ తేజ్‌, వంకాయలపాటి ఉమేశ్‌ ఉన్నారు. అధీకృత పెట్టుబడిగా రూ.15 కోట్లు, చెల్లించిన మూలధనంగా రూ.12.01 కోట్లు పెట్టుబడి పెట్టారు.

  Ramcharan about airline business

  వివరాల్లోకి వెళితే...గత నెల రోజుల వ్యవధిలో కేంద్ర పౌర విమానయాన శాఖ 6 విమానయాన సంస్థలకు నిరభ్యంతర పత్రాల (ఎన్‌ఓసీ)ను అందజేసింది. విమానయాన శాఖ అనుమతించిన సంస్థల్లో హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా కూడా ఉంది. ఈ సంస్థకు ఇద్దరు డైరెక్టర్లు ఉండగా.. వీరిలో ఒకరు ఎంపీ చిరంజీవి తనయుడు, సినీహీరో రామ్‌చరణ్‌ తేజ్‌ కావడం గమనార్హం. మరో డైరెక్టర్‌ వంకాయలపాటి ఉమేష్‌.

  ఇప్పటివరకు తెలుగు రాష్ట్రానికి సంబంధించి, విమానయాన సేవల్లో విజయవాడకు చెందిన ఎయిర్‌కోస్టా ఒక్కటే సేవలు అందిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ పొందిన మిగతా అయిదు సంస్థల్లో ఎయిర్‌వన్‌ ఏవియేషన్‌, జెక్సస్‌ ఎయిర్‌, ప్రీమియర్‌ ఎయిర్‌లు జాతీయ స్థాయి సేవలకు సన్నాహాలు చేసుకుంటుండగా..ఎయిర్‌ కార్నివాల్‌, జావ్‌ ఎయిర్‌లైన్స్‌లు ప్రాంతీయ సేవలకు పరిమితం కానున్నాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ సంస్థలకు పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు ఎన్‌ఓసీ జారీ చేసినట్లు తెలుస్తోంది. సాధ్యమైనన్ని నగరాలకు విమానాలు నిర్వహించాలనే ఆకాంక్షను మంత్రి పలుమార్లు వ్యక్తంచేశారు.

  చార్టర్‌ విమానాలు నిర్వహించే సంస్థలతో పాటు నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్లు షెడ్యూల్డ్‌ ఆపరేటర్లుగా మారేందుకు అనుమతిస్తామని కూడా పౌర విమానయాన శాఖ ప్రకటించిన నేపథ్యంలో తాజా అనుమతులు వచ్చాయి. ఇవన్నీ కార్యకలాపాలు ప్రారంభిస్తే.. దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి రావడమే కాదు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 8 సంస్థలు విమాన సేవలకు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.

  English summary
  Ramcharan Tej entered airline service business. He and Vankayalapati Ramesh are the directors of ‘Turbo Mega Airways Private Ltd. They have registered their company on 2013, March 14th with Hyderabad as its headquarters. The two directors of the company have invested total Rs.27.01 crores.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more