హైదరాబాద్ : చెర్రి అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం ఓపినింగ్ ఈ రోజు ఘనంగా జరిగింది. రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్ లో బండ్ల గణేష్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ముహూర్తం కొద్ది మంది ముఖ్యాతిధుల మధ్య జరిపారు.
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ముహూర్తం ఇది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం షాట్ కు చిరంజీవి క్లాప్ ఇవ్వగా...నిర్మాత బండ్ల గణేష్ తండ్రి బండ్ల నాగేశ్వరరావు కెమారా స్విచ్ ఆన్ చేసారు.
వివి వినాయిక్ ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈ ముహూర్తానికి మెగా ఫ్యామిలీ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అరవింద్, అల్లు అర్జున్ హాజరయ్యారు. అలాగే ప్రముఖ నిర్మాతలు డివివి దానయ్య, కె ఎస్ రామారావు, ఎన్ వి ప్రసాద్, ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డా కెఎల్ నారాయణ, దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడపల్లి, రచయిత వక్కంతం వంశీ, కోటగిరి వెంకటేశ్వరరావు, జి హరికుమారు, శిరీష్ ,లక్ష్మణ్ హాజరయ్యారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ..రామ్ చరణ్ తో ఓ సెన్సేషనల్ మూవి తియ్యాలన్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. కొరటాల శివ అద్బుతమైన కథ చెప్పారు. హై టెక్నికల్ వేల్యూస్ తో నిర్మించే ఈ చిత్రం మా బేనర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. జూలై లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఏకథాటిగా షూటింగ్ జరుపుతాము అన్నారు.
రామ్ చరణ్ తో పాటు మరో 50 మంది ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సమర్ఫణ..శివబాబండ్ల, నిర్మాత బండ్ల గణేష్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం కొరటాల శివ.
రామ్ చరణ్-కొరటాల శివ మూవీ పూజా కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, వివి వినాయక్, కొరటాల శివ, బండ్ల గణేష్
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడుతున్న చిరంజీవి
మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు
Ram Charan and Koratala aka Mirchi Siva film was launched to at producer Bandla Ganesh's office. The muhurat ceremony was held today. Chiranjeevi along with his son Ram Charan, daughter-in-law Upasana, Allu Aravind, Allu Arjun were present on the occasion. Search is on for rest of the cast and also the leading lady of the film. Bandla Ganesh is producing this film under Parameswara Arts. Presently Ram Charan is working for the film Yevadu. After completion of Yevadu, Cherry will start shoot for Koratala Siva’s film.