»   » ఇంకెప్పుడూ డైరెక్షన్‌ జోలికి వెళ్లకూడదని ఫిక్సయిపోయాను: ‘వీర’డైరక్టర్

ఇంకెప్పుడూ డైరెక్షన్‌ జోలికి వెళ్లకూడదని ఫిక్సయిపోయాను: ‘వీర’డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా తొలి చిత్రం 'ఒక ఊరిలో" యావరేజ్‌గా ఆడింది. ఆ సినిమా టైమ్‌లో ఎదురయిన కొన్ని చేదు సంఘటనల వల్ల ఇంకెప్పుడూ డైరెక్షన్‌ జోలికి వెళ్లకూడదని, బుద్ధిగా పబ్లిసిటీ డిజైనింగ్‌ చేసుకుందామని ఫిక్సయిపోయాను. అయితే బెల్లంకొండ సురేష్‌గారు పట్టుబట్టి మరీ నాతో 'రైడ్‌" తీయించారు. ఆ సినిమా మంచి హిట్‌ అయ్యింది. తొలిచిత్రంతో 'యావరేజ్‌", మలిచిత్రంలో 'హిట్‌" అందుకున్న నేను మూడో చిత్రం 'వీర"తో 'సూపర్‌హిట్‌" సొంతం చేసుకుంటానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను అంటున్నారు దర్శకుడు రమేష్ వర్మ. అలాగే నా అనుభవంలో చిన్న సినిమాకే ఎక్కువ కష్టపడాలి. పెద్ద సినిమా చెయ్యడమే సులువు. హీరో ఇమేజ్‌ని దృష్టి పెట్టుకుని పనిచేస్తే చాలు. రవితేజ వల్లనే ఇలాంటి ఫీలింగ్ కలిగిందనుకుంటా. ఈ చిత్రంతో కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్స్‌ని రమేశ్‌వర్మ బాగా డీల్ చేస్తాడనే పేరు వస్తుందని వంద శాతం నమ్మకంతో ఉన్నా. ఈ సినిమా తర్వాత మళ్లీ రవితేజతోనే చెయ్యాలనుకుంటున్నా. 'వాడే వీడు' అనే కథ రెడీ చేస్తున్నా. ఇందులో రవితేజ ద్విపాత్రల్లో కనిపిస్తారు. ఒకటి క్లాస్, ఒకటి మాస్ అంటూ తన ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పుకొచ్చారు.

English summary
Mass Maha Raja is acting in the movie Veera produced by Ganesh Indukuri under the banner Sanvi Productions directed by ride fame Ramesh Varma, veera is coming as a full length mass entertainer and is all set to release on may 20th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu