»   » ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం ...అంటే ప్రభాస్ పుట్టిన రోజుకి సరిగ్గా ఒక్క రోజు ముందర రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఖైదీ నెంబర్ 150 సెట్ కు వెళ్లి ..చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో అప్పట్లో చాలా ఓ రేంజిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .

ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రభాస్ బాహుబలి 2 ఫస్ట్ లుక్ కంటే ఇదే చాలా పెద్ద న్యూస్ గా మారి, ఎక్కడ చూసినా అదే కనపడింది. మెగా స్టార్ స్వయంగా ప్రభాస్ ని కౌగిలించుకున్న ఫోటో గురించి అందరూ అప్పుడు మాట్లాడుకున్నారు. ఆ టాపిక్ అయ్యిపోయింది.

గానీ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటో ని ఇప్పుడు బయటకి లాగి రకరకాల కుల వైషమ్యాలు రెచ్చగొట్టే పనిలో పడ్డారు. చిరంజీవి మనస్ఫూర్తిగా ప్రభాస్ ను, ప్రభాస్ మనస్ఫూర్తిగా చిరంజీవిని కౌగిలించుకున్నారంటే, అది వారి మూర్ఖత్వమేనని పెట్టిన ట్వీట్ కు విపరీతమైన స్పందన రాగా, తన ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తూ మరిన్ని ట్వీట్లు చేశాడు. ఆ ట్వీట్స్ ఏమిటనేది క్రింద చూద్దాం.

వాళ్లు బాహుబలి అయ్యిపోదామనుకునేటంత పిచ్చోళ్లు

'మెగా-ప్రభాస్ ల మధ్య ప్రేమ గుండెల్లోంచి వచ్చిందని అనుకుంటే.. వాళ్లు బాహుబలి అయిపోదామని ట్రై చేస్తున్న పిచ్చోళ్ల కింద లెక్క.

మెగాను ద్వేషంతో కూడిన

ఇక ప్రభాస్ ను ప్రేమిస్తాను.. మెగాను ద్వేషంతో కూడిన ప్రేమతో ప్రేమించేందుకు ఇష్టపడతాను.. రాజమౌళితో ప్రేమతో కూడిన ద్వేషాన్ని కోరుకుంటాను' అంటూ అర్ధం అయ్యీ కాకుండా చెప్పడమే కాదు.. 'నిజమైన మూర్ఖులు ఇది అర్ధం చేసుకోలేరు అన్నారాయన

కాపులపై చిరంజీవికి ...

తనకి కులపిచ్చి చాలా ఎక్కువగా ఉంది అనీ అందుకే ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పాడు వర్మ. కాపులపై చిరంజీవికి ఎలాంటి ఫీలింగ్స్ లేవని, కేవలం కమ్మవారు మాత్రమే ఇందుకు కారణం చెప్పగలరని అన్నాడు.

కాస్ట్ ఫీలింగే దేశ భక్తి

'మెగాస్టార్.. బాహుబలి స్టార్ లకు నిజమైన దేశభక్తి చూపించడానికి కాస్ట్ ఫీలింగ్ సరైన దారి' అన్నాడు వర్మ.

ప్రభాస్ ని, మెగాస్టార్ ని...

నేను మెగాస్టార్ ని, ప్రభాస్ ని సమానంగా ప్రేమించను. కానీ రాజమౌళిని వీరిద్దరి విభిన్నంగా ఇష్టపడతాను.

స్పెల్లింగ్ కు కూడా స్పెల్లింగ్ తెలియదు

'మెగాస్టార్-ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలామందికి స్పెల్లింగ్ కి స్పెల్లింగ్ కూడా తెలీదు కాబట్టి.. నా ఇంగ్లీష్ ని అర్ధం చేసుకోలేకపోయినందుకు వారిని క్షమించేస్తున్నా' అంటూ ముగించాడు వర్మ.

ఏడేళ్లు తగ్గాయి

రీసెంట్ గా దీపావళి సందర్బంగా ఖైదీ నెంబర్ 150 లుక్ విడుదల చేసినప్పుడు వర్మ పై విధంగా కామెంట్ చేసారు. ఏడేళ్ల క్రితం తను చూసినప్పటికంటే ఏడేళ్లు వయస్సు ఇంకా తగ్గిందని అన్నారు.

తన సెట్ కు వచ్చిన రాజమౌళి గురించి

ఫిల్మ్ మేకింగ్ లో బాహుబలి...నటనలో బాహుబలితో మాట్లాడుతున్నప్పుడు అని సర్కార్ సెట్ లో తీసిన ఫొటో మన ముందుంచారు.

సీన్ వివరిస్తూ వర్మ

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ...అమితాబ్ తో సర్కార్ 3 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సెట్ లో సీన్ ని వివరిస్తూ ఆయన ఇలా బిజీగా ఉన్నారు.

సర్కార్ 3 సెట్ లో కి బాలయ్య వచ్చినప్పుడు

లెజండ్ వచ్చి సర్కార్ నటనను పరిశీలిస్తున్నప్పుడు అంటూ ఈ ఫొటోని షేర్ చేసారు వర్మ.

ఈ కాంబో కు జోహార్లు

అసలు ఇలాంటి కాంబినేషన్ ని ఎవరూ ఊహించరు. రామ్ గోపాల్ వర్మ, బాలయ్య కలిసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

హిందీలో బిగ్ బీతో తెలుగులో..

హిందీలో బిగ్ బీతో తెలుగులో..

English summary
RGV tweeted: If any1 believes Mega loves Prabhas from heart and Prabhas loves Mega from heart then they ar too F'ckn dumb to ever become Bahubali.I luv Prabhas n I luv 2 hatelove Mega n I want 2 make lovehate with Rajmouli ..only real dumbs won't understand this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu