»   » కత్రినాపై కన్నేసిన క్రికెటర్.. నిర్మాతగా సంజయ్‌తో ఉగ్ర చిత్రం..

కత్రినాపై కన్నేసిన క్రికెటర్.. నిర్మాతగా సంజయ్‌తో ఉగ్ర చిత్రం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటులుగా మారిన క్రికెటర్లను గతంలో ఎంతో మందిని చూశాం. కానీ తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా నిర్మాతగా మారనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్‌తో రూపొందించే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు. క్రికెట్ ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందించే కథతో తాను సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రమీజ్ రాజా

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రమీజ్ రాజా

ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. సినీ పరిశ్రమకు రమీజ్ కొత్తేమీ కాదు. 2016లో బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటించారు. బాలీవుడ్ స్టార్లు జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ నటించిన ‘డిష్యూం'లో రమీజ్ అతిథి పాత్రను పోషించారు. కిడ్నాప్ గురైన క్రికెటర్ పాత్రలో ఆయన ఆకట్టుకొన్నారు.

కత్రినా కైఫ్, మహిరాఖాన్ పేర్ల పరిశీలన

కత్రినా కైఫ్, మహిరాఖాన్ పేర్ల పరిశీలన

యాక్షన్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని రమీజ్ అన్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపిక జరుగలేదని, పలువురి పేర్లను పరిశీలిస్తున్నామని జియో న్యూస్ కు చెప్పారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పాకిస్థాన్ సంతతికి చెందిన మహీరా ఖాన్ అత్యంత ప్రతిభావంతులైన తారలని, వారు ఆసక్తి చూపితే వారితో పనిచేయడానికి సిద్ధమని రమీజ్ తెలిపారు.

సంజయ్ బయోపిక్‌లో రణబీర్ కపూర్

సంజయ్ బయోపిక్‌లో రణబీర్ కపూర్

ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ శిక్ష అనుభవించి ఇటీవల పుణెలోని ఎర్రవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్నది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సంజయ్ పాత్రను పోషిస్తున్నాడు.

పాకిస్థాన్ తీరు సిగ్గుచేటు

పాకిస్థాన్ తీరు సిగ్గుచేటు

ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నిలోని రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఫైనల్ మ్యాచ్ ను పాకిస్థాన్ లో ప్రసారం చేయకపోవడాన్ని రమీజ్ రాజా తప్పుపట్టారు. క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీసేలా వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. పాక్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

English summary
Pakistan former cricket captain Ramiz Raja announced on Thursday that he has cast Bollywood superstar Sanjay Dutt as the male lead in a film that he's producing
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu