»   » ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ డేస్, బడ్జెట్

‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ డేస్, బడ్జెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్‌ హీరోయిన్స్. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు నిర్మాత. సినిమాని ఈ వారంలోనే వస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ విషయమై హరీష్ శంకర్ మాట్లాడుతూ...124 రోజుల్లో తీశాం. ఎన్టీఆర్ అన్ని సినిమాల్లో తక్కువ టైమ్‌లో కంప్లీట్ అయిన సినిమా ఇది. 124 రోజులు షూటింగ్ చేస్తే అందులో హీరో వర్కింగ్ డేస్ వచ్చి 100 నుంచి 105 వరకు ఉంటాయి అన్నారు.

బడ్జెట్ గురించి హరీష్ శంకర్ చెప్తూ...మిగతా ప్రొడ్యూసర్ ఎవరైనా బడ్జెట్ ఎంతయిందీ అని అడిగేవాణ్ణి. దిల్ రాజుగారు మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన్ని బడ్జెట్ గురించి అడగాల్సిన అవసరం రాలేదు. ''టేబుల్ ప్రాఫిట్ ఉన్న సినిమా చేస్తున్నాం హరీష్'' అన్నారు. ఆయనెపడూ నన్ను ఇంతలో తీయాలని రిస్ట్రిక్ట్ చేయలేదు. ఎంతలో తీస్తున్నారని నేను ఆయన్ని అడగలేదు. ఈ క్వశ్చన్ మీరు దిల్ రాజుగారిని అడిగితే ఆన్సర్ దొరుకుతుంది అన్నారు.


అలాగే 'రామయ్యా వస్తావయ్యా'లో యాక్షన్ పార్ట్ గురించి చెప్తూ... యాక్షన్ పార్ట్ ఇందులో ఎక్కువ ఉంటుందండీ. గబ్బర్‌సింగ్‌తో కంపేర్ చేస్తే ఇందులో యాక్షన్ పార్ట్ ఎక్కువ. అంటే ఎన్టీఆర్ హీరోయిజమ్ చూపించే ఫైట్స్ ఒకటీ రెండుంటాయి కానీ మిగతావన్నీ స్క్రిప్ట్ డిమాండ్ చేసిన యాక్షన్ సీన్స్ ఉంటాయి. నేను ఎక్కువ సినిమాలు చేయలేదు కానీ నేను ఇంతవరకు చేసిన వాటిలో బెస్ట్ స్క్రిప్ట్ అయితే 'రామయ్యా వస్తావయ్యా' అని తేల్చి చెప్పారు.

'రామయ్యా వస్తావయ్యా' టైటిల్‌లో సాఫ్ట్‌నెస్. ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగుల్లో రఫ్‌నెస్. కథాపరంగా ఎన్టీఆర్ యువజన నాయకుడని సమాచారం. లుక్ పరంగా మాత్రం చాక్లెట్‌బోయ్‌లా అనిపిస్తున్నాడు. భిన్నంగా గోచరిస్తున్న ఈ అంశాలన్నీ సినిమాపై ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు దర్శకుడు హరీష్‌శంకర్. నిర్మాత 'దిల్'రాజు కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరో విషయం ఏంటంటే... ప్రేక్షకుల ఊహకందని ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో ఉందని సమాచారం. దాన్ని దర్శక, నిర్మాతలు గోప్యంగా ఉంచారని వినికిడి.

దిల్ రాజు మాట్లాడుతూ..... ''ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలతో సినిమా రూపొందింది. ఎన్టీఆర్‌ నటన, సమంత అందాలు సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయి. శ్రుతిహాసన్‌ పాత్ర గత సినిమాల్లోకంటే వైవిధ్యంగా ఉండబోతోంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది''అన్నాయి. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖ రామన్, రవిశంకర్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

English summary
NTR’s forthcoming film Ramayya Vastavayya is scheduled to release on October 11th. Rammayya Vastavayya got an A Certificate from the Censor Board . No cuts were suggested by the CB. The film is slated to release on October 11. Yes the release date has been announced officially.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu