twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైకోర్టుకి క్షమాపణ చెప్పిన రామోజీరావు...!

    By Sindhu
    |

    రామోజీరావు 2008లో కన్నడ భాషలో ముక్తా-ముక్తా అనే టీవీ సీరియల్ తీశాడు. 2008లోనే ఈ సీరియల్ ను టి ఎన్ సీతారామ్ అనే వ్యక్తి ద్వారా టెలికాస్ట్ చేయబడింది. అది చూసిన జిఆర్ మోహన్ అనే న్యాయవాది ఈ సీరియల్ లో న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా సీన్స్ చిత్రీకరించబడ్డాయని కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. తర్వాత రామోజీ రావు, టిన్ సీతారామ్ సుప్రిమ్ కోర్టు నుండి స్టే తెచ్చుకొన్నారు. అయితే సుప్రిమ్ కోర్టు ఆ స్టే తొలగిస్తూ ఈ కేసును కర్ణాటక హైకోర్టులోనే తేల్చుకోడంటూ సుప్రిమ్ కోర్టులో కేసు కొట్టివేయబడింది...

    దాని తర్వాత రామోజీరావు హైకోర్టుకు హాజరు కానందున, కర్ణాటక హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారిచేసింది. అయితే గత్యంతరం లేక రామోజీరావు గత ఎప్రిల్ నెల 19తేదిన హైకోర్టుకు హాజరై షరత్తులతో కూడిన క్షమాపణలు కోరుకున్నాడు. కేసు విచారణ జరపుతూ మే 31 కి వాయిదా వేశారు. అనగా ఈ రోజు(మే 31)న కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తులు వేగు సూరి అప్పారావు, ఆనంద్ ఆద్వర్యంలో ద్విసభ్య బెంచ్ వారు విచారణ జరిపింది. ఆరోగ్యం బాగోలేదని, కొన్ని అనివార్య కార్యాలవల్ల తను కోర్టు హాజరు కాలేనని ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రై.లి చైర్మెన్ రామోజీరావు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకొంటానని న్యాయస్థానానికి బేషరత్తులతో కూడిన క్షమాపణలు కోరుతూ అర్జి సమర్పించారు.

    ఈ విషయంపై న్యాయమూర్తులు విచారణ జరిపి తర్వాత రామోజీరావు, టిఎన్ సీతారామ్ పై కేసు వేసిన జిఆర్ మోహన్ కు ఎటువంటి అభ్యంతరం లేనందున..ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రమోజీరావుకి, టిఎన్ సీతారామ్ కి హెచ్చరించి కేసు కొట్టివేయడమైనది.

    English summary
    Media baron Ramoji Rao who is running a dozen TV Channels in different languages has been flayed by Karnataka high court for telecasting a Kannada TV serial titled ‘Mukta…Mukta’ without knowing about its content.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X