»   » బాహుబలిలో రమ్య కృష్ణ బాగా కష్టపడ్డ సన్నివేశం

బాహుబలిలో రమ్య కృష్ణ బాగా కష్టపడ్డ సన్నివేశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి-ది బిగినింగ్' సినిమాలో బాగా హైలెట్ అయిన పాత్రల్లో రమ్య కృష్ణ పోషించిన ‘శివగామి' పాత్ర ఒకటి. ఆ పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరెవరూ సెట్ కారేమో అనేంతగా ఆమె అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చేసే అప్పుడు కొన్ని సన్నివేశాల్లో నటించడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చిందట.

సినిమాలో ఆమె కొన్ని సన్నివేశాల్లో ఒక బిడ్డను ఒకే చేత్తో పట్టుకుని నడుస్తూ ఉంటుంది. ఈ సీన్ల కోసం శారీరకంగా కష్టపడ్డానని రమ్యకృష్ణ చెప్పింది. చేతిలో బిడ్డను పెట్టుకుని యుద్ధం చేయడం, నడవటం, డైలాగులు చెప్పడంలో కాస్త ఇబ్బంది పడ్డానని రమ్య కృష్ణ తెలిపింది.


Ramya Krishna about Baahubali movie

అయితే ప్రస్తుతం సినిమా చూశాక జాతీయ అవార్డును సాధించినంత సంతోషంగా ఉన్నట్లు రమ్య చెప్పుకొచ్చింది. నీలాంబరి రోల్ కంటే శివగామి పాత్ర ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులకు బాగానే నచ్చుతుందని వెల్లడించింది.

English summary
Ramya Krishna about Baahubali movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu