»   » మీరు రమ్యకృష్ణ ఫ్యాన్ అయితే ఇది హ్యాపీ న్యూస్

మీరు రమ్యకృష్ణ ఫ్యాన్ అయితే ఇది హ్యాపీ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కాస్త లేటుగా అయినా రమ్యకృష్ణ తన అభిమానులను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా పలకరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ‘meramyakrishnan' అనే పేరుతొ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట ట్వీట్ తో ఈ భామ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె అభిమానులు వెంటనే ఆమెను ఫాలో అవటం మొదలెట్టారు. ఆమె ట్వీట్స్ మీరూ చూడాలని అనుకుంటే... ఇక్కడ చూడవచ్చు.

సోషల్ నెట్వర్కింగ్ పుణ్యమా అని ఎంతో మంది స్టార్లు తమ అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒకింత రిస్కు, బెడద వున్నప్పటికీ చాలా మంది ఈ వేదికను వినియోగించుకుంటున్నారు. సినిమా రంగంలో ఈ తతంగం మరింత పాపులర్ అవుతుంది. తాజాగా ట్విట్టర్ లోకి నటీమణి రమ్యకృష్ణ రావడంతో తన అభిమానులు ఫాలో అవడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఈ ఏజడ్ బ్యూటీ ఒక తమిళ చిత్రంలో నటిస్తుంది.తెలుగులో నాగార్జున నటిస్తున్న సినిమాలో కనిపించడమేకాక బాహుబలిలో శివగామి పాత్రలో ఆకట్టుకోనుంది.

Ramya Krishna is now on Twitter

https://twitter.com/meramyakrishnan

అలాగే తాజాగా ఆమె లక్ష లైక్ లు తన ఫేస్ బుక్ పేజీలో సంపాదించుకుంది.. ఈ సందర్బంగా తన అభిమానులను ధాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రమ్యకృష్ణ ప్రతిభ ఏమిటో తెలుగు ప్రేక్షకులందరికి తెలుసు. తాను చేసే ప్రతి పాత్రలో పరిపూర్ణత కోసం తపిస్తుందామె. బాహుబలి చిత్రంలో ఆమె శివగామిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మేకింగ్ చూసిన వాళ్లు ఆమె ప్రతిభ చూసి మంత్ర ముద్గులు అవుతున్నరు.

గతంలో ఆమె గురించి ....ఇంతటి తీవ్రమైన భావోద్వేగాలున్న పాత్రను, దానికి పూర్తిగా న్యాయం చేయగలిగే ప్రతిభాపాటవాలున్న నటిని ఇప్పటివరకు చూడలేదు. న్యాయానికి నిలువెత్తు రూపం ఈ శివగామి అంటూ రమ్యకృష్ణ పాత్ర గురించి రాజమౌళి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

గతంలో విడుదల చేసిన పోస్టర్స్ తో ఆయా క్యారెక్టర్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన రాజమౌళి.. తాజా మేకింగ్ విషయంలో మాత్రం.. పాత్రను పక్కనపెట్టి ఈ చిత్ర నిర్మాణంలో రమ్యకృష్ణ ఎమోషన్స్ ని పండించే తీరుని చూపించారు. గత రెండున్నర ఏళ్లుగా బాహుబలి యూనిట్‌ కు రమ్యకృష్ణ వెన్నుదన్నుగా నిలచారని.. కృతజ్ఞతలు తెలియజేశాడు.

English summary
Ramya Krishna thanked fans after reaching 1 lakh likes on her Facebook page. "A big thank you to my fans, friends, well wishers and my family for your love and support.... :)," she wrote.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu