»   » రమ్యకృష్ణ కి ఆ అవకాశం మళ్ళీ 17 ఏళ్ళకి వచ్చింది

రమ్యకృష్ణ కి ఆ అవకాశం మళ్ళీ 17 ఏళ్ళకి వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నీలాంబరి.... పదిహేడేళ్ళ క్రితం వచ్చిన "నరసింహ" (పడయప్పా) లో రమ్య కృష్ణ చేసిన పాత్ర. హీరో తో సమానంగా అదీ ఒక లెజెండ్ అంతటి పేరున్న అగ్రహీరో రజినీ కాంత్ తో పోటాపోటీగా నటించాల్సిన సినిమా. ఎక్కడా తడబడలేదు. నరసింహ ఒక బ్లాక్ బస్టర్ కావటం లో ఖచ్చితంగా రమ్యకృష్ణ కూడా సగం కారణం.

నీలాంబరి అనే పేరు కొన్నేళ్ళ పాటు తమిళనాట గుర్తుండిపోయింది. తమిళ అమ్మాయే అయినా ఎక్కువగా తెళుగులోనే పాపులర్ అయిన రమ్యకృష్ణ పడయప్పా లాణ్తి ఒక్క సినిమాతోనే అక్కడ స్టార్ రేంజ్ ని సొంతం చేసుకుంది.

చాలాకాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రమ్యకృష్ణకు అవకాశాలు వెతుక్కుంటు వస్తున్నాయి. బాహుబలితో అందరిని మెప్పించిన రమ్యకృష్ణ...సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో అలరించింది. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల రమ్యకృష్ణ ఇపుడు టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

Ramyakrishna in Robo 2.0 ?

రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సూపర్ హిట్ గా రన్ చేస్తుంది. బాహుబలి సీక్వెల్ లో నటిస్తూనే మరో వైపున మంచి పాత్రలోస్తే ఆ పాత్రలను కూడా వద్దనకుందా చేస్తోంది. ఇప్పటికే రమ్యకృష్ణ కమల్ హాసన్ తో తొలిసారిగా హీరోయిన్ గా శృతి హాసన్ కు తల్లిగా ఎంపిక అయిందనే టాక్ వినిపిస్తోంది.

కాగా ఇప్పుడు మరో ఆఫర్ అందుకున్న రమ్యకృష్ణ అని అంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో రాజనీకాంత్ 'రోబో 2.0' సినిమాలో ఓ ముఖ్య పాత్రకు గాను రమ్య ను ఎంచుకున్నారట. ఈ సినిమాలో రమ్య పాత్ర చిన్నదైనా కధలో కీలక పాత్ర అట. చాలా ప్రాముఖ్య మున్న పాత్ర కనుక రమ్యకృష్ణ అయితే బాగుంటుందని రోబో చిత్ర యూనిట్ భావిస్తున్నారట. 17 సంవత్సరాలు తర్వాత మళ్ళీ రజినీ కాంత్ తో కలిసి తెరపై కనిపించబోతున్నారట.

English summary
Ramyakrishna has been approached for upcoming movie "Robo 2.0" in which Superstar Rajinikanth is playing the lead role and the movie is directed by Shankar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu